టాలీవుడ్

వైయస్ మ్యాటర్ లోకి నాగ్ ని సైతం లాగారే

nagarjuna-ysrమీడియాలో వార్తలు వండేటప్పుడు మిగతావారికన్నా ముందు ఉండాలనే తపనతో తమ దగ్గరున్న వార్తకు…తమదైన పైత్యం కలపటం సర్వం సాధారణం అయిపోయింది. అలాగే రీసెంట్ గా వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కు రంగం సిద్దమవుతోందని వార్త రాగానే…కొందరు ఉత్సాహవంతులు నాగార్జున ఈ చిత్రంలో వైయస్ గా నటించబోతున్నారంటూ న్యూస్ వండి వడ్డించేసారు.

అయితే మీడియా వర్గాల ద్వారా ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏమిటి అంటే నాగార్జున ని అసలు దర్శకుడు ఆ పాత్రకు అనుకోనేలేదట. అంతేకాదు…అసలు ఇంకా జగన్ సైతం ఈ బయోపిక్ విషయమై గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఇన్ కేస్ ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అయితే ఈ సినిమా పేరు యాత్ర అని పెట్టబోతున్నారని తెలుస్తోంది. చిల్లా విజయ్ రెడ్డి, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా ఈ చిత్రం పట్టాలు ఎక్కుతుంది. ఈ టైటిల్ ని వారే రిజిస్టర్ చేయించారు.

ఆనందో బ్రహ్మ చిత్రంతో సక్సెస్ సాధించిన దర్శకుడు మహి రాఘవ.. వైఎస్ ఆర్ చిత్రానికి స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుని.. ప్రస్తుతం నటీనటుల వేటలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే వైఎస్ ఆర్ పాత్ర‌కి మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టిని తీసుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట ద‌ర్శ‌కుడు. ఇందుకోసం మ‌మ్ముట్టితోను చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంద‌ని టాక్‌.

ఇక వైఎస్ఆర్ బ‌యోపిక్ రూపొందించేందుకు వైఎస్ త‌న‌యుడు జ‌గ‌న్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపుదిద్దుకుంటున్న వేళ వైఎస్ ఆర్ బ‌యోపిక్‌కి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్‌గా నిలిచాయి.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16