టాలీవుడ్

నాని, నాగ్ చిత్రం ఆ హాలీవుడ్ సినిమా కాపీనా?

nagarjuna-naniకింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘భలే మంచిరోజు’ .. ‘శమంతకమణి’ సినిమాలతో తనకంటూ ఓ స్టైల్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరక్షన్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం బట్టి ఈ సినిమాలో నాగార్జున మాఫియా డాన్ గా.. నాని డాక్టర్ గా కనిపించనున్నారు. ఈ రెండు పాత్రల మధ్య వున్న సంబంధం.. వాళ్లమధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ఆసక్తిని కలిగించే విధంగా వుంటాయని అంటున్నారు.

అలాగే ఈ చిత్రం ఆ మధ్యన హాలీవుడ్ లో వచ్చిన ఎనలైజ్ థిస్ నుంచి ప్రేరణ పొందారని తెలుస్తోంది. ఈ మూవీలో నాగార్జున ఒక డాన్ పాత్ర పోషిస్తున్నట్లు…అలాగే నాని డాక్టర్‌గా (సైకియాట్రిస్ట్‌గా) కనిపించనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. వీరిద్దరి మధ్య వ‌చ్చే స‌న్నివేశాలు హిలేరియ‌స్‌గా ఉంటాయ‌ని సమాచార‌ం. డైరెక్టర్ ఆదిత్య ఈ పాత్రలతో.. వీరి మధ్య వచ్చే సన్నివేశాలతో.. ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా కథను సిద్ధం చేసుకున్నారని ఇండస్ట్రీలో టాక్. ప్రముఖ నిర్మాత అశ్వ‌నీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడి కానున్నాయి.e.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll