టాలీవుడ్

చైతూకు పూర్తిగా ఇగో

 

chaiచైతూ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే సినిమా మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు కూడా ‘రెడ్డి’ పేరు కలిసి వచ్చేలా చాలా సినిమాలే వచ్చాయి. అయితే ఈ తరహా టైటిల్ మాత్రం ఇదే తొలి సారి కావటంతో ఈ సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

కొత్త జంట సినిమాలో హీరో స్వార్థపరుడి పాత్రలో కనిపిస్తాడు. భలే భలే మగాడివోయ్ సినిమాలో హీరో నాని మతిమరుపు, మహానుభావుడు సినిమాలో హీరో శర్వానంద్ ..క్లీన్ నెస్ పాత్రల్లో దర్శనమిస్తారు. దాంతో చైతూ తో ఏ పాత్ర చేయించబోతున్నాడనేది ఆసక్తిగా మారింది. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో మారుతి ఈ సినిమాలో హీరోను పూర్తి స్దాయి ఇగో ఉన్న పాత్రలో చూపించబోతున్నాడు.

అలాగే ఈ చిత్రంలో అను ఇమ్యాన్యుయిల్ నే హీరోయిన్ అట. ‘అజ్నాతవాసి’ తీస్తున్నపుడు అను టాలెంట్ చూసి ఆ చిత్ర నిర్మాత రాధాకృష్ణ.. తనకే చెందిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బేనర్లో తెరకెక్కబోయే ‘శైలజారెడ్డి అల్లుడు’లో ఆమెకు ఛాన్స్ ఇప్పించాడట. ఈ చిత్రంలో కీలకమైన హీరో అత్త పాత్రకు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ముందు రమ్యకృష్ణ పేరు వినిపించగా.. ఆ తర్వాత శ్రీదేవి పేరు కూడా తెరమీదికి వచ్చింది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

ఒక్క క్షణం DEC 28
అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll