టాలీవుడ్

షాకిచ్చే అప్ డేట్: ‘బాహుబలి’కి పనిచేసిన చైతూ

chai-baahubali‘రారండోయ్‌ వేడుక చూద్దాం తో హిట్ కొట్టిన నాగ్ చైతన్య ఇప్పుడు మరో చిత్రం యుద్దం శరణం ను కూడా రెడీ చేశాడు. సాయి కొర్రపాటి నిర్మాణంలో కృష్ణ వైర‌ముత్తు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ చైతు ఈ సినిమా చేస్తున్నాడు. సినిమా దాదాపు ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చేసింది. వచ్చే నెల 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తల్లితండ్రులను చంపిన వారిపై రివెంజ్ తీర్చుకునే క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో చైతూ డ్రోన్స్ స్పెషలిస్ట్ గా కనిపిస్తాడు. రేవతి, రావు రమేష్ తల్లితండ్రులుగా నటిస్తున్నారు. వారి మరణంపై డిఫరెంట్ స్కెచ్ లతో, డ్రోన్ ల సాయంతో ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడన్నది ఈ సినిమా లైను.

డ్రోన్.. ఈ ప‌దం ఈ మ‌ధ్య తెలుగు ఇండ‌స్ట్రీలో బాగా పాపుల‌ర్ అయింది. పెద్ద పెద్ద మీటింగ్ ల‌కు ఈ డ్రోన్ కెమెరాలు వాడుకుంటారు. సినిమాల్లోనూ ఇప్పుడు డ్రోన్ కెమెరాల హ‌వా మొద‌లైంది. దీన్నే ఫ్లై కెమెరాలు కూడా అంటారు. ఇప్పుడు నాగ‌చైత‌న్య సినిమా కోసం డ్రోన్ ల‌ను వాడుతున్నారు

ఈ చిత్రానికి సంభందించిన కొత్త విశేషం ఏంటంటే… ‘బాహుబలి’కి వర్క్‌ చేసే డ్రోన్‌ ఆపరేటర్‌గా చైతూ కనిపిస్తారట. ఈ సినిమాకు రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌. కార్తికేయ లైన్‌ ప్రొడ్యూసర్‌. ఆయనే ఇంట్రడక్షన్‌ సీన్స్‌లో హీరోని ‘బాహుబలి’ డ్రోన్‌ ఆపరేటర్‌గా చూపిస్తే బాగుంటుందనే ఐడియా ఇచ్చారట. కృష్ణ ఆర్‌.వి. మరిముత్తు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో లావణ్యా త్రిపాఠి హీరోయిన్‌గా, శ్రీకాంత్‌ విలన్‌గా, రావు రమేశ్, మురళీ శర్మ, రేవతి ముఖ్యపాత్రల్లో నటించారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించిన ఈ సినిమాకు రజనీ కొర్రపాటి నిర్మాత.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll