టాలీవుడ్

నాగ్-వర్మ కథ కాపీనా,నాగ్ ఏమంటారు?

Nagarjuna-Ram-Gopal-Varma-New-Movie-Posters-3ఫస్ట్ లుక్, టీజర్ చూసి ఈ సినిమా ఫలానా హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టింది అంటూ పసిగట్టేస్తున్న రోజులివి. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినిమా ప్రారంభం రోజే ఈ సినిమా కాపీ కొట్టింది అంటూ ప్రచారం మొదలైపోతోంది. అక్కడ నుంచి మీడియాలో చర్చలు..చివరకు మేకర్స్ …అబ్బబ్బే అలాంటిదేం లేదు అని ప్రకటనలు. తాజాగా రామ్‌గోపాల్‌ వర్మ- అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం నిన్న ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అలా సినిమా ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే ఈ చిత్రం ఓ హాలీవుడ్ చిత్రం కాపీ అంటూ తేల్చేసారు. అందులో నిజమెంత ఉన్నా ప్రచారం మాత్రం గట్టిగా జరుగుతోంది.

ఆ సినిమా ఏంటి

2008 లో హాలీవుడ్ లో వచ్చిన టేకెన్ అనే సినిమా తరహాలో నాగ్ కొత్త చిత్రం ఉండబోతుందట. లియం నీసన్ హీరో గా వచ్చిన ఈ చిత్రంలో యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ సినిమాలో కిడ్నాప్ అయినా తన కూతురిని ఎక్స్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఎలా రక్షించుకున్నడు అనేది ప్రధాన కథ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో వర్మ కూడా స్టోరీని రెడీ చేసుకున్నాడని కొందరు చెబుతున్నారు.

నాగ్ ఏమంటారు

నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా విషయానికొస్తే రాము అందరికీ నచ్చేలా, ఒక ప్రత్యేకమైన కథని సిద్ధం చేశాడు. నా పాత్రలోనే ఓ ఘర్షణ ఉంది. ఒక మనిషి ఓ విషయాన్ని నమ్మితే, ఏదైనా వెనకాడకుండా ఎలా సాహసం చేస్తాడో అలాగే ఉంటుంది నా పాత్ర. రాములో కసి కనిపిస్తోంది. రాత్రి 6 గంటలకే ఫోన్‌కి దూరమయ్యే నాకు, 12 గంటలకి కూడా తన నుంచి ఫోన్‌ వస్తుంది. తన తపన అలా ఉంటుంది. ఈ నెలలో 10 రోజులు చిత్రీకరణ చేస్తాం. అఖిల్‌ చిత్రం పూర్తవ్వగానే మళ్లీ మొదలు పెడతాం.

డిసెంబరు 22 తర్వాత నుంచి ఏకధాటిగా సినిమా చేసి, త్వరగా విడుదల చేయాలని మా ఇద్దరి కోరిక. ‘శివ’లాగా సాంకేతికంగా ఉన్నతంగా ఉండేలా ఈ సినిమా చేస్తానని రాము నాకు మాటిచ్చాడు. తెలుగు సినిమా, భారతీయ సినిమా కొత్త తరహాలో సాగుతోంది. సరైన సమయంలో సరైన స్థానంలో ఉన్నాం మనం. మా సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామ’’అన్నారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll