కోలీవుడ్

అలాంటి వార్తలు రాస్తే కోర్టుకు ఎక్కుతానంటూ మండిపడింది

amala-paullప్రముఖ నటి అమలాపాల్‌ మీడియాపై కోప్పడ్డారు. మలేసియాకు చెందిన ఓ డాన్స్ స్కూల్ ఓనర్ అళగేశన్‌ తనతో వ్యాపారం చేయాలనుకున్నాడని ఇటీవల అమలా పాల్‌ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనను లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అళగేశన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే..అమలను కలవడానికి ఆమె మేనేజర్‌ ప్రదీప్‌ కుమార్‌ తనకు సాయం చేశాడని అళగేశన్‌ విచారణలో తెలిపాడు.

కానీ తనకు అళగేశన్‌ ఎవరో కూడా తెలీదని ప్రదీప్‌ అంటున్నాడు. అమల కూడా ప్రదీప్‌కే మద్దతు తెలుపుతున్నారు. ఈ కేసులో మీడియా తన మేనేజర్‌ను తప్పుగా చూపిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ కేసుకు తన మేనేజర్‌కు ఎలాంటి సంబంధం లేదని అనవసరంగా తప్పుడు వార్తలు సృష్టించద్దని వేడుకున్నారు. ‘కొన్ని మీడియా వర్గాలు నా మేనేజర్ ప్రదీప్‌ కుమార్‌‌ గురించి తప్పుగా రాస్తున్నాయి. ఈ కేసు విచారణలో ఉంది. అందుకే మౌనంగా ఉంటున్నాను. కానీ ఇలా తప్పుడు వార్తలు సృష్టిస్తే దావా వేయడానికి కూడా వెనుకాడను.’ అని హెచ్చరించారు.

కేసు వివరాల్లోకి వెళితే…

డాన్స్ స్కూల్ ఓనర్ అళగేశన్‌ తనతో వ్యాపారం చేయాలని అనుకున్నాడని హీరోయిన్ అమలాపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మలేషియాలో మహిళాభివృద్ధికి సంబంధించి ‘డ్యాన్సింగ్‌ తమిళచ్చి’ కార్యక్రమంలో పాల్గొనే క్రమంలో టీ నగర్‌లోని నృత్య పాఠశాలలో శిక్షణ తీసుకుంటున్నాని, అక్కడ పాఠశాల నిర్వాహకుడై అళగేశన్‌ వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో విశాల్‌ అమలాపాల్‌ను ప్రశంసించారు. ఎటువంటి బెరుకు లేకుండా ధైర్యంగా ఫిర్యాదు చేసినందుకు హ్యాట్సాఫ్‌ చెప్పారు. లైంగిక వేధింపులను బయటపెట్టడానికి నిజంగా చాలా తెగింపు ఉండాలన్నారు. దీనిపై అమలాపాల్‌ తాజాగా స్పందించారు. మీటూ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేస్తూ తనకు మద్దతు తెలిపిన విశాల్‌కు ధన్యవాదాలు తెలిపారు.

‘నా తరఫున మాట్లాడినందుకు ధన్యవాదాలు విశాల్‌. ఇది ప్రతి మహిళ బాధ్యతగా భావిస్తున్నా. వేధింపులపై మౌనం వహించి, వదిలివేయడం సరికాదని నాకు తెలిసేలా చేశావు. ఆయన (నిందితుడు) నాతో వ్యాపారం చేయాలి అనుకున్నాడు. ఆయనకు ఉన్న గుర్తింపు, ఆయన చేసే పనులు చూసి చాలా భయపడిపోయా’ అని అమలాపాల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

tr> tr>
అ! FEB 16
ఆచారి అమెరికా యాత్ర FEB 16
మనసుకు నచ్చింది FEB 16
కిరాక్ పార్టీ FEB

Now Showing

tr> tr>
తొలిప్రేమ FEB 10
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10