కోలీవుడ్

మురుగ‌దాస్ నెక్ట్స్ చిత్రం ఫుల్ డిటేల్స్

Director AR Murugadoss Stills
Director AR Murugadoss Stills

రీసెంట్ గా మహేష్ బాబు హీరోగా స్పైడర్ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల‌లో తెర‌కెక్కించి ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసిన ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌. అయితే ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. త్వరలో ఈ ద‌ర్శ‌కుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో హాలీవుడ్ మూవీ మిలియ‌న్ డాల‌ర్ బేబి చిత్రాన్ని రీమేక్ చేయ‌నున్నాడు. ఇందులో టీవి న‌టి మ‌రీనా కౌర్‌ని హీరోయిన్ గా ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది.

బిగ్ బాస్ 10, సీఐడీ వంటి సీరియ‌ల్స్‌లో చేసిన మ‌రీనా తొలిసారి వెండితెర‌పై అదీ అక్ష‌య్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ కొట్టేసింది. హిందీ వ‌ర్షెన్‌లో క్లైంట్ ఈస్ట్‌వుడ్ పాత్ర‌ని అక్ష‌య్ పోషించ‌నుండ‌గా, హిల్ల‌రీ స్వాంక్ పాత్ర‌లో మరీనా క‌నిపించ‌నుంది. అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న‌ న‌టించే ఛాన్స్ త‌న‌కి ద‌క్కినందుకు టీవి న‌టి చాలా సంతోషంగా ఉంది. త‌న క‌ల ఇన్నాళ్ళ‌కి నిజం అయింద‌ని అంటుంది. అక్ష‌య్ ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండగా, అవి పూర్తైన త‌ర్వాత మురుగ‌దాస్ హాలీవుడ్ మూవీని ప‌ట్టాలెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో DEC 29

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll