సినిమా కళ

బలమైన షార్ట్ ఫిలిం తీసిన వాళ్ళదే రాజ్యం!

మీరు షార్ట్ ఫిలిమ్స్ రంగానికి కొత్తవారా? ఈ రంగంలో మీ అదృష్టాన్ని పరీక్షించు కోవాలనుకుంటున్నారా? అయితే మీ కోసం కొన్ని సూచనలు…షార్ట్ ఫిలిమే కదా, మీ చేతిలో పనే కదా అని ఆషామాషీగా తీసేయాలనుకోవద్దు. తీసే ఆ పదినిమిషాల షార్ట్ ఫిలిం ని కూడా సరైన అవగాహనతో, సరికొత్త అయిడియాతో,బలమైన ముద్ర వేసేలా తీస్తే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. అదొక కాలింగ్ కార్డ్ లా ఉపయోగపడుతుంది మీకు. ప్రపంచవ్యాప్తంగా ఫెస్టివల్స్ సర్క్యూట్ కు, లేదా ఏదైనా కమర్షియల్ వర్క్ తెచ్చి పెట్టేందుకు అది మీకు ఉపయోగపడుతుంది. సినిమా అవకాశాలు సరే, సినిమాకథ కూడా తయారు చేసుకునే సామర్ధ్యం మీకుంటే అది కూడా సాధ్యమే.
ఐతే మొదటగా ఇందుకు మీరు మూడు షార్ట్ ఫిలిమ్స్ ని చూడాల్సి వుంటుంది. అవి, 1.The Crush, 2. Please Say Something, 3. Forever’s Gonna Start Tonight.
ఈ మూడూ దృశ్య మాధ్యమం గురించి మీకెన్నో పాఠాలు చెప్తాయి. వీటి లోబలమైన, పొదుపైన డైలాగులు మాత్రమే కాదు, దృశ్యపరమైన విశిష్టతలు కూడా ఎంతో నేర్పుతాయి. కలర్, సౌండ్, బ్యాక్ గ్రౌండ్ ఇమేజెస్ లతో కూడిన మూడ్ క్రియేషన్ చెప్పాలనుకుంటున్న ఐడియాని/కథని సమున్నతంగా ఎలివేట్ చేసేవిగా వుంటాయి. దృశ్యాల్ని డైలాగులతో నడిపినంత మాత్రాన అది మీ టాలెంట్ అని అన్పించుకోదు. ఆ పని ఎవరైనా చేయగల రు. ఎందుకంటే, అదే సులభమైన పని కనుక . కానీ మాటలు లేని మౌన దృశ్యాలు కూడా చెప్పాలనుకున్న విషయాన్ని పలుకుతాయ్. ఇలాటి దృశ్యాల్ని సృష్టించ గలగడమే మీ ప్రతిభకు దర్పణం అవుతుంది. ఇది బాగా గుర్తుంచు కోవాలి : మీరు పెళ్లి వీడియో తీయడం లేదు! ఈ మూడు షార్ట్ ఫిలిమ్స్ వీటి దర్శుకులు చెప్పాలను కుంటున్న అంశాన్ని అతి శక్తివంతంగా ప్రతిపాదిస్తాయి. కారణం అవి పర్సనల్ టాపిక్స్ కావడమే. ఇలాకాకుండా, అంతరిక్ష యానం, జీవిత పరమార్ధం, ఇంకేదో ఫిలాసఫీ అంటూ పెద్దపెద్ద విషయాల జోలికి వేల్లారనుకొండ్ ఇంతే సంగతులు. వాటిని అంత ప్రభావశీలంగా చెప్పడం మీకు సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి తీయాలనుకుంటున్న ఐడియాని ఏదైనా పర్సనల్ టాపిక్ కె పరిమితం చేయడం ఉత్తమం. అలాగే చెప్పే కథ ఒక్క పాత్ర లేదా, రెండు పాత్రల కి సంబంధించి చెప్పండి. ఇంతకి మించి షార్ట్ ఫిలిం పరిధిని పెంచకండి. షార్ట్ ఫిలిం పూర్తి నిడివి చలనచిత్రం కాదు. షార్ట్ ఫిలిం కథల కాన్వాస్ సినిమా కథలంత విస్త్రుతమైనది కాదు. ఉపకథలకి, దివువశ్రేణి పాత్రలకి, మాంటేజి లకి స్కోపు వుండదు. షార్ట్ ఫిలిం లో ఒక సమస్యనే ఎత్తుకోవాలి. చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ తీసేవారు కథలో ఒకటికి మించిన సమస్యల్ని డీల్ చేస్తూంటారు. అంటే ఒకటికి మించిన పాయింట్లు చెప్పడమే. ఇది చూపరుల ఏకాగ్రతని దెబ్బ తీస్తుంది. ఒక్క కథనే, ఒక్క పాయింటు మీదే దృష్టి పెట్టి దాన్ని వీలైనంత బలంగా చెప్పడం ప్రాక్టీసు చేయండి.https://www.youtube.com/watch?v=wdNx5VRXGeE
మీ దగ్గరున్న కొద్దిపాటి ఆర్ధిక వనరులతోనే బడ్జెట్ ప్లాన్ చేయండి. అది మించకుండా చూసుకోండి. పైన పేర్కొన్న షార్ట్ ఫిలిమ్స్ లో రెండు లైవ్ యాక్షన్ ఫిలిమ్స్ అన్న సంగతి గమనించే వుంటారు. ఐనప్పటికీ వాటిలో కారు ఛేజింగులు లేవు, పేలుళ్లు లేవు, లేజర్ ఎఫెక్ట్స్ అసలే లేవు…కేవలం మూసిన గదిలో పాత్రలు చెప్పుకుంటున్న విషయమే ఆ టెన్షన్ అంతా క్రియేట్ చేస్తోంది. భారీ వ్యయాలతో తీసే సినిమాలతో మిమ్మల్ని పోల్చుకుని అలాటి ఎఫెక్ట్స్ పెట్టాలని మాత్రం ప్రయత్నించకండి.అది షార్ట్ ఫిలిమ్స్ క్రియేటివిటీ కాదు. అలాగే షూటింగ్ ని సినిమా షూటింగు లాగానో లేకపోతే, టీవీ సీరియల్ షూటింగు లాగానో, మందీ మార్బలంతో అట్టహాసంగా ఏర్పాటు చేసుకోకండి! అసలు షార్ట్ ఫిలిమ్స్ ఎందుకు తీయాలి? హాబీ కోసమా? రాబడి కోసమా? సినిమా అవకాశాల కోసమా? ఈ మూడింటిలో ఏదైనా కావచ్చు. మూడోదే బలమైన కారణం కావచ్చు. సినిమా దర్శకుడుగా మారడానికి కాన్ఫిడెన్స్ కోసం షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నామని చెప్పే వాళ్ళూ వున్నారు. ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా వేలాది షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు. అయినా షార్ట్ ఫిలిమ్స్ బాధాకరంగా చాలా తక్కువ వీక్షకులను కలిగిఉంటున్న మాధ్యమంగానే కొనసాగుతోంది. ఇప్పుడు ఆన్ లైన్ లో లో పాపులర్ అయిన ఫలానా షార్ట్ ఫిలిం చూశారా? అని మన మిత్రుల్నే అడిగిచూస్తే, ఇందులో నిజం తెలిసిపోతుంది. అదే ఒక సినిమాగురించి అడిగితే చూశామని చప్పున చెప్పేసే వాళ్ళుంటారు. ఇలాగని షార్ట్ ఫిలిం మేకర్లు ర్లు నిరుత్సాహ పడనక్కర లేదు. అసలు షార్ట్ ఫిలిం అంటే ఏమిటో అర్ధం చేసుకోవడానికే ఎక్కువ కృషి చేయాలి. తీసే సంగతి తర్వాత. ఒక సాలిడ్ షార్ట్ ఫిలిం తీయడమంటే ఒక సినిమా తీయడం కాదు. భవిష్యత్తులో సినిమా తెయడానికి తగిన ఆత్మ విశ్వాసాన్ని సమకూర్చుకోవడమే. షార్ట్ ఫిలిమ్స్ సినిమాలకి ఎంట్రీ టికెట్టే కావచ్చు.https://www.youtube.com/watch?v=Q2YdJy0w66Y
అయితే సినిమాల్ని ప్రేక్షకులు చీకటి హాలులో సమూహంగా కూర్చుని,ఆయ సినిమాల్లో వుందే విషయాన్ని బట్టి సమూహంగా కన్నీళ్లు పెట్టుకోవడమో, కడుపుబ్బా నవ్వదమో చేస్తారు. అవే సినిమాల్నిగనుక ఆన్ లైన్ లో ప్రదర్శించి మరింత మంది ప్రేక్షకుల్ని సమ్మోహన పర్చే ప్రయత్నం చేస్తే దారుణంగా విప్హ్లామవుతారు. ఎందుకని? ఎందుకని? మాధ్యమంతో వచ్చిన తేడా! బిగ్ స్క్రీన్ మీద హై ఎండ్ టెక్నాలజీని రంగరించి – అద్భుత దృశ్య-శ్రవణ ఫలితాలతో చిత్రీకరణలు చేసే సినిమాలకి ఆన్ లైన్ ప్లాట్ ఫాం చాల చిన్నది.అందుకే గతంలో సూరజ్ బర్జాత్యా తను తీసిన భారీ బడ్జెట్ సినిమా ‘హమ్ సాథ్ సాథ్ హై’ ని ఆన్ లైన్లో దేశంలోనే మొదటిసారిగా పెయిడ్ షోగా విడుదల చేస్తే ఆ ప్రయోగం దారుణంగా విఫలమైంది. కనుక సినిమాల్ని సినిమాలుగా వెండితెరమీద చూసి భావోద్వేగాలకు గురికావాల్సిందే. టీవీ సీరియల్స్ ని టీవీలోనే చూసి ఆనందించాల్సిందే. అలాగే షార్ట్ ఫిలిమ్స్ ని ఆన్ లైన్లో చూసి సరిపెట్టుకోవాల్సిందే. అలాగే కొన్ని కథలు వుంటాయి. అవి నవలలు గానే బాగా వర్కౌట్ అవుతాయి. కొన్ని గేమ్స్ గానే పనికొస్తాయి. లేదా కామిక్స్ గానే ఆకట్టుకుంటాయి. కనుక సినిమా కథలకి ఆన్ లైన్ అనేది ఆధునిక డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ ఫాం కాలేదు. కానీ సినిమాలకి అది పూర్తిగా కొత్త ప్లాట్ ఫామే. కొత్త ప్లాట్ ఫాం కొత్త తరహా కథల్నిడిమాండ్ చేస్తుంది. ఈ కొత్త మాధ్యమం బలాబలాలను సరిగ్గా అర్ధం జేసుకున్న మేకర్లు ఉత్తమమైన, అతి నూతనమైన కథల్నలతో కూడిన షార్ట్ ఫిలిమ్స్ ని సృష్టించగలరు.
ఐనా కూడా సినిమారంగానికి చెందిన వాళ్ళు ఆన్ లైన్ మీడియం ని టీవీ ఛానెల్స్ లో వార్తల్లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే- గాలిలో కలిసిపోయే వ్యవహారంగానే చిన్న చూపు చూస్తారు. షార్ట్ ఫిలిం మేకర్లు ఎన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసినా తాము తీసే ఒక్క సినిమాకి సాటి రావని, తమలాగా సినిమా తీయలేరని భావిస్తూంటారు. నిజమే ఆన్ లైన్ పరిమితులు ఆన్ లైన్ కుంటాయి. రెడ్ కెమెరాల్ని వాడలేరు. డీటీ ఎస్ ని సృష్టించ లేరు, భారీ సెట్స్ వేయాలేరు. ఇలా క్వాలిటీకి సంబంధించి వెయ్యి కారణాలు చెప్పవచ్చు. అయినంత మాత్రాన సినిమా వాళ్లతో పోల్చుకుని కాన్ఫిడెన్స్ ని కోల్పోనవసరం లేదు. సింపుల్ గా చెప్పాలంటే క్వాలిటీ మీదనే ఆధార పడకూడదు. సినిమాలకి పోటీగా షార్ట్ ఫిలిమ్సే తీయకూడదు. సినిమాల్లో వాడుకునే ఆ సాంకేతిక అంశాలన్నీ కూడా నిజానికి నిజానికి మంచి కథ చెప్పడానికి అవసరమే లేదు. మంచి కథలకి టెక్నాలజీ అడ్డు గోడగా వుంటుంది. మంచి కథలు అసలు టెక్నాలజీకే అతీతంగా వుంటాయి. పాప కార్న్ తినే లోపు ముగిసిపోయే షార్ట్ ఫిలిమ్స్ మొబైల్ లోనో, లాప్ టాప్ లోనో చూడ్డానికి అనువుగా ఉన్నాయా లేదా అనేదే ప్రధానం. టెక్నికల్ క్వాలిటీ కాదు. విషయం ప్రధానం.

-సికిందర్

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16