బాక్స్ ఆఫీస్

‘మహానుభావుడు’పై ఆశ్చర్యపోయే వార్త

mahanubhavudu stills 07‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘భలే భలే మగాడివోయ్‌’‘బాబు బంగారం’ చిత్రాలు మారుతిలో ఎంత మంచి దర్శకుడు ఉన్నాడో చాటి చెప్పాయి. ఇటీవల శర్వానంద్‌ని ‘మహానుభావుడు’గా చూపించి, మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొన్నారు. ఈ చిత్రం ఓ రేంజి కలక్షన్స్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ చిత్రం థియోటర్స్ పెంచుతున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 100 స్క్రీన్స్ పెంచుతున్నారు.

అయితే ‘భలే భలే మగాడివోయ్‌’ లెక్కలతోనే ఈ చిత్రాన్ని సైతం తెరకెక్కించినట్టున్నారనే ఓ మాట పరిశ్రమలో వినిపించింది.. ఈ విషయమై మారుతి స్పందిస్తూ… ఆ కథకీ ఈ సినిమాకీ పోలికే లేదు. అందులో హీరోకి మతిమరుపు. ‘బాబు బంగారం’లోని హీరో జాలీగా ఉంటాడు. ఇందులోని హీరోకి అతి శుభ్రత అలవాటు. మూడింట్లో హీరోల ప్రవర్తనా విధానం, కథనాలు వేర్వేరుగా ఉంటాయి. మామూలుగా మనుషుల్లోని గుణాలు, ఇష్టాలు, లోపాలను తీసుకుని కథల్ని సిద్ధం చేసి చూపిస్తే గనక ప్రేక్షకులు తొందరగా కనెక్ట్‌ అవుతారు. మాకు సంబంధించిన విషయాన్నే చర్చించారంటూ ఆయా పాత్రల్లో వాళ్లని చూసుకొంటారు.

దసరా కానుకగా సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మహానుభావుడు’ ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లోనే రూ. 14 కోట్ల షేర్ ను అందించింది. పోటీలో జై లవ కుశ, స్పైడర్ సినిమాలున్నా ఇప్పటికీ మహానుభావుడు హవా తగ్గలేదు. ఈ లెక్కన లాంగ్ రన్ లో మహానుభావుడు రూ. 30 కోట్లు షేర్ సాధించే అవ‌కాశాలున్నాయ‌ని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll