టాలీవుడ్

MCA కలెక్షన్స్ ఎఫెక్ట్..రవితేజ ఓకే చేసాడు

mca1సిద్దార్ద,శృతిహాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఓహ్ మై ఫ్రెండ్ చిత్రంతో పరిచయమైన దర్శకుడు వేణు శ్రీరామ్. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాకపోవటంతో 2011 నుంచి 2017దాకా గ్యాప్ వచ్చింది. తాజాగా మళ్లీ ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు పిలిచి ..నాని హీరోగా ఎమ్ సి ఎ చిత్రం ఇవ్వటంతో గాడిలో పడ్డాడు. ఎమ్ సి ఎ సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుకుంది. దాంతో వేణు శ్రీరామ్ ఊపిరి పీల్చుకుని తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈ కొత్త చిత్రంలో వేణు శ్రీరామ్ ..డైరక్ట్ చేయబోయే హీరో ఎవరూ అంటారా..

తాజాగా వేణు శ్రీరామ్ తన తదుపరి చిత్రం గురించి ఇంటర్వూల్లో చెప్పారు. ఆయన చెప్పినదాన్ని బట్టి రవితేజ తో చేయబోతున్నారు. గతంలో రవితేజతో ఆగిపోయిన ప్రాజెక్టు మళ్లీ ఆన్ అవుతోందని తెలుస్తోంది. ఆ చిత్రం ‘ఎవడో ఒకడు’. ఈ చిత్రంలో యువతను ఆకట్టుకునే అంశాలు చాలా ఉంటాయని, యువత ఆశయాలకు అద్దం పట్టే కథ అవుతుందని ఆయన అన్నారు.

అప్పట్లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…ఆర్య, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, ఎవడు వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన తమ బ్యానర్‌లో ఇది మరొక మంచి చిత్రం అవుతుంది అన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

ఒక్క క్షణం DEC 28
అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll