టాలీవుడ్

మంచు విష్ణు కొడుకు..ఎదురులేని వాడు

vishnuనూతన సంవత్సర ప్రారంభం రోజున మంచు విష్ణు సతీమణి విరోనికా పండంటి మగ శిశువుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మంచువారి కుటుంబానికి జనవరి 1వ తేదీ మరింత ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆ బిడ్డకు ‘అవ్రామ్‌ భక్త’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకొన్నారు విష్ణు.

‘‘వాడిని అరియానా ‘బేబీ లయన్‌’ అని, వివియానా ‘బేబీ టెడ్డీ బేర్‌’ అని పిలుస్తున్నారు. మేమంతా అవ్రామ్‌ భక్త అంటున్నాం. అవ్రామ్‌ అంటే ఎవ్వరూ ఆపలేనివాడు అని అర్థం’’ అని ట్వీటారు విష్ణు. మోహన్‌బాబు అసలు పేరు మంచు భక్త వత్సలం నాయుడు కావడంతో అందులోని భక్తని కొడుక్కి పెట్టుకున్నారు విష్ణు దంపతులు. ఈ దంపతులకు తొలి సంతానంగా ఇద్దరు కవలలు అరియానా, వివియానా జన్మించారు.

తొలిసారి తనకు మనవడు పుట్టిన సందర్భంగా మోహన్‌బాబు సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘నా బిడ్డలు పుట్టినప్పుడు మూడు షిఫ్ట్‌ల్లో షూటింగ్‌లో బిజీగా ఉన్నందుకు వారికి సమయం కేటాయించలేకపోయాను. కానీ ఇప్పుడు నా మనవడు పుట్టగానే 3 షిఫ్ట్‌లూ వాడితోనే గడుపుతున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

విష్ణు ప్రస్తుతం ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలో నటిస్తున్నారు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విష్ణు సరసన ప్రగ్యాజైశ్వాల్‌ నటిస్తున్నారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll