టాలీవుడ్

టీజర్ బాగానే ఉంది..వివాదాలు రావు కదా

డా. మోహన్ బాబు నిర్మాణ సారధ్యంలో మంచు విష్ణు హీరోగా వచ్చిన ‘దేనికైనా రెడీ’ సినిమా అప్పట్లో పెద్ద సంచలనమై కూర్చుంది. విడుదలైనప్పటి నుంచి బ్రాహ్మణుల గురించి చెడుగా చూపించారని బ్రాహ్మణులు సినిమాకి వ్యతిరేకంగా ధర్నాలు చేసారు. ఇది సరైంది కాదు అని చెప్పడానికి మోహన్ బాబుకి మద్దతుగా చెన్నై మరియు తమిళనాడు నుండి కొంత మంది బ్రాహ్మణులు హైదరాబాద్ తీసుకురావాల్సిన పరిస్దితి వచ్చింది.

బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలంటూ ఆ సినిమా రిలీజైన నాటి నుంచీ బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేసాయి. అదంతా గతం…ఇప్పుడు మరోసారి మంచు విష్ణు తాజా చిత్రం …విషయంలో ఆ సీన్ రిపీట్ అవుతుందా అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ లు మొదలయ్యాయి.

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. సరదా సన్నివేశాలతో ఈ టీజర్‌ను రూపొందించారు.

పూజారులుగా ఇక్కడ జీవితం సాగిస్తున్న బ్రహ్మనందం, ఆయన టీమ్ తో విష్ణు అమెరికాకు వెళ్దామని, అక్కడైతే డాలర్లు సంపాదించొచ్చని చెబుతారు. దీంతో అందరూ కలిసి అమెరికా వెళ్తారు. అక్కడ వారు ఎదుర్కొనే సంఘటనలను వినోదబరితంగా టీజర్‌‌లో చూపించారు. చివర్లో వచ్చిన యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. ధనం మూలం ఇదం జగత్‌.. ప్రపంచంలో జరిగే తప్పులన్నింటికీ డబ్బే కారణం’ అంటూ హీరో చెప్పే డైలాగులు హైలెట్ గా నిలిచాయి.

జి నాగేశ్వరరెడ్డి ‘ఆచారి అమెరికా యాత్ర’కు దర్శకత్వం వహించారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. పద్మజా పిక్చర్స్‌ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. జనవరి 26న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16