టాలీవుడ్

హ్యాపీనే కానీ, విషెష్ చెప్తే మళ్లీ ఏమంటాడో

manchu-vishnuనూతన సంవత్సర ప్రారంభం రోజున మంచు విష్ణు సతీమణి విరోనికా పండంటి మగ శిశువుకు జన్మనిచ్చారు. దీంతో మంచువారి కుటుంబానికి జనవరి 1వ తేదీ మరింత ప్రత్యేకంగా నిలిచిపోయింది. చాలాకాలం ప్రేమించుకున్నాక 2008లో పెళ్ళిచేసుకున్న మంచు విష్ణు దంపతులు.. 2011లో అరియానా వివియానా అనే ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త పిల్లాడు అడుగుపెట్టడం మంచువారింట మరిన్ని కొత్త ఆనందాలను, పండుగలను తెస్తోంది.

ఇక తన భార్య త్వరలోనే శిశువుకు జన్మను ఇవ్వబోతోందని, ఈ నిరీక్షణను భరించలేకపోతున్నానని విష్ణు శనివారం ట్వీట్‌ చేశారు. వారసుడు పుట్టాలంటూ అభిమానులు కామెంట్లు చేయడంతో.. ఆదివారం ఆయన సోషల్‌మీడియాలో క్లాస్ తీసుకున్నారు. తనకు అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేదని చెప్పారు.

‘చాలా మంది నాకు కొడుకు పుడితే వారసుడుంటాడు అని సందేశాలు పంపుతున్నారు. వాళ్లందరికీ నేను ఒకటి చెప్పదల్చుకున్నాను. నాకు ఇద్దరు వారసురాళ్లు ఉన్నారు. అరియానా, వివియానా. ఇంకొక అమ్మాయి పుడితే మూడో వారసురాలు అవుతుంది. అబ్బాయి పుడితే వారసుడు అవుతాడు. వారసత్వానికి అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేదు’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

దాంతో ఇప్పుడు మరి మంచు విష్ణుకు ఏమని మెసేజ్ పంపి శుభాకాంక్షలు చెప్పాలి అని సినిమా జనం,ట్విట్టర్ ప్రజలు ఆలోచనలో పడుతున్నారు. మరో ప్రక్క సోషల్ మీడియాలో సైతం ఇదే విషయం చర్చగా మారింది. ఇప్పుడు బాబు పుట్టాడని మంచు విష్ణుకు శుభాకాంక్షలు చెప్తూ వారసుడు వచ్చాడంటే ఏమి క్లాస్ పీకుతాడో అని..కేవలం కంగ్రాట్స్ అని చెప్పి ఊరుకుంటున్నారు.

విష్ణు ప్రస్తుతం ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలో నటిస్తున్నారు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విష్ణు సరసన ప్రగ్యాజైశ్వాల్‌ నటిస్తున్నారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll