టాలీవుడ్

లవ్, యాక్షన్ ఉన్నోడు.. మనోజ్ ‘గుంటూరోడు’ (ట్రైలర్)

మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రలో ఎస్కే సత్య తెరకెక్కించిన చిత్రం గుంటూరోడు. కోట శ్రీనివాసరావు, రావు రమేష్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తోన్న మనోజ్ ఈ సినిమాతో అభిమానులను అలరించనున్నాడని అంటున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ ని అభిమానుల అంచనాలు అందుకునేలా రెడీ చేసి రిలీజ్ చేశారు. సాయి వసంత్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. త్వరలో ఈ మూవీని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో మంచు మనోజ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న గుంటూరోడు ట్రైలర్ విడుదలైంది. గుంటూరోడు టైటిల్ కి తగట్టు పవర్ఫుల్ గా అనిపిస్తోంది. ఈ టీజర్ కొన్ని భారీ స్టంట్స్ మరియు మంచు మనోజ్ స్టైల్ పంచ్ డైలాగ్స్ తో ఫుల్ మాస్ గా ఉండి ఆకట్టుకుంటోంది. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

మంచు మనోజ్, కొద్దికాలంగా హిట్ కోసం ఎంతగానో తపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనకు మంచి గుర్తింపు తెచ్చిన డిఫరెంట్ కమర్షియల్ సినిమానే నమ్ముకొని ‘ఒక్కడు మిగిలాడు’, ‘గుంటూరోడు’ అన్న రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో గుంటూరోడు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమైంది. సత్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించారు.

మనోజ్ గతంలో చేసిన మాస్ ఎంటెర్టైనెర్స్ అయిన బిందాస్, మిస్టర్ నూకయ్య, పోటుగాడు మరియు కరెంటు తీగ లాంటి చిత్రాల మాదిరిగా ఆశాజనకంగా కనిపిస్తోంది. కొత్త డైరెక్టర్ ఎస్కె సత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మనోజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ రొమాన్స్ చేస్తోంది. గుంటూరోడుకు ‘ప్రేమలో పడ్డాడు’ అనే ట్యాగ్ లైన్ ఉంది.

ఈ సినిమాలో ఇంకా రాజేంద్ర ప్రసాద్, సంపత్, కోట శ్రీనివాస్ రావు, రావు రమేష్, పృథ్వి లాంటి వాళ్ళు కూడా నటించారు. క్లాప్స్ & విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సిద్దార్థ్ రామస్వామి సినిమాటోగ్రఫీ మరియు శ్రీ వసంత్ మ్యూజిక్.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16