టాలీవుడ్

మంచు లక్ష్మి ప్రపోజల్ కు నాగ్ ఓకే చెప్తాడా..ఇదే టెన్షన్

nagarjuna-lakshmi-manchu-at-lfw-2013-stills03ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో వెబ్ సిరీస్ ట్రెండ్ న‌డుస్తున్న సంగతి తెలిసిందే. వెబ్ సీరిస్ తో కోట్లు వచ్చి పడుతున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ప‌లు సంస్థ‌లు వెబ్‌సిరీస్‌ల‌పై దృష్టి సారిస్తున్నాయి. వ్యూయ‌ర్స్ ఆధారంగా .. ఆద‌ర‌ణ‌ను బట్టి ఆదాయం ఆర్జించే అవ‌కాశం ఉన్న వెబ్ సిరీస్ ఇటీవ‌లి కాలంలో బాగానే పాపుల‌రైంది. టీవి సీరియల్ అయితే ముందు ఛానెల్ పెద్దల చేత ఓకే చేయించుకోవాలి.

అదే యూ ట్యూబ్ లో అయితే అందుకు మినహాయింపు ఉంది. మీ దగ్గర స్టఫ్ ఉందే యూ ట్యూబ్ లో పెట్టి డబ్బులు వెనకేసుకోవచ్చు అనే విషయం చాలా మందికి అర్దమైంది. ఓవైపు పేరుకు పేరు, డ‌బ్బుకు డ‌బ్బు వ‌చ్చే ఛాన్సున్న ఐడియా ఇది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ కి చెందిన ప‌లు సినీనిర్మాణ‌ సంస్థ‌లు వెబ్ సిరీస్‌లు తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

ఇప్పటికే హీరో రానా “సోషల్” అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇప్పుడు రానా బాటలోనే విక్టరీ వెంకటేశ్ కూడా వెబ్ సిరీస్ వైపు వస్తున్నాడు. రాజీవ్ గాంధీ హత్యోదంతం పై తీస్తున్న వెబ్ సీరిస్ లో ఆయన నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మంచు లక్ష్మి కూడా వెబ్ సిరీస్ పై కన్ను వేసింది.

అందుతున్న సమాచారం మేరకు.. నాగార్జున హీరో గా ఒక వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తుందట మంచు లక్ష్మి. ఈ వెబ్ సిరీస్ ని అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేయనున్నాడట. మంచు లక్ష్మి ఆల్రెడీ నాగార్జున తో ఈ విషయమై చర్చలు జరిపింది. అయితే నాగార్జున నిర్మాతగా, నటుడుగా, స్టూడియో ఓనర్ గా ఫుల్ బిజీ. దాంతో ఆలోచించి చెప్దాం అన్నారట.

దాంతో నాగార్జున ఒప్పుకుంటే ఓకే, ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే ఇదే వెబ్ సిరీస్ ని సుమంత్ తో తీసే ఆలోచనలో ఉందిట లక్ష్మి. మొత్తం 10-15 ఎపిసోడ్స్ ఉండే ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందట.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2