బాక్స్ ఆఫీస్

రిలీజ్ డేట్ ఇచ్చారు..కానీ ఆ విషయం వదిలేసారే

manasuసందీప్‌ కిషన్‌, అమైరా దస్తూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘మనసుకు నచ్చింది’. నటి, నిర్మాత మంజుల ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. ఆనంది ఆర్ట్స్‌, ఇందిరా ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రాధన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. బ్రిందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ ఇప్పటికే రిలీజ్ అయ్యి..మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ అంటూ లేని సందీప్ కిషన్, ఈ సినిమాతో వస్తున్నా ఇప్పటి వరకూ ఏ విధమైన బజ్ క్రియేట్ కాలేదు. ముఖ్యంగా గత చిత్రాలు ఓపినింగ్స్ కూడా సరిగా తెచ్చుకోలేకపోయాయి. దాంతో బిజినెస్ వర్గాలు కాస్త ఆందోళనతోనే ఈ సినిమా వంక చూస్తున్నాయి. అలాగే సినిమాకు ఇప్పటివరకూ సరైన పబ్లిసిటీ,ప్రమోషన్ అనేది ప్రారంభించలేదు.

ఫీల్ గుడ్ లవ్ స్టోరి తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో సందీప్ విజయం సాధించడం ఖాయమని దర్శకురాలు మంజుల మాత్రం థీమాగా ఉంది. దర్శకురాలిగా మంజులకు ఈ సినిమా సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.

ఈ సినిమాలో, త్రిదా చౌదరి కీలకమైన పాత్రను పోషించింది. యూత్ కి కనెక్ట్ అయ్యే ప్రేమకథాంశంతో తెరకెకక్కిన ఈ సినిమాలో మంజుల కూతురు కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుండటం విశేషం.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16