బాలీవుడ్

జప్తుకై కోర్టు ఆదేశాలు

mallika-cannes4బాలీవుడ్ నటి మల్లికా శెరావత్‌ విషయమై పారిస్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె తన భర్తతో ఉంటున్న ప్లాట్ అద్దె కట్టకపోవడంతో ఫర్నీచర్ జప్తునకు ఆదేశాలు ఇచ్చింది.

మల్లిక తన ఫ్రెంచ్ భర్త సిరిల్లే ఆక్సేన్‌ఫ్యాన్స్ తనకు కట్టాల్సిన 78,787 యూరోలు (రూ.59 లక్షల 98వేలు) అద్దెను చెల్లించలేదని అపార్ట్ మెంట్ యజమాని కోర్టుని ఆశ్రయించాడు. పారిస్ లో మల్లిక ఆమె భర్తతో కలిసి నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌కు నెలకు 6,054 యూరోల (మొత్తం 78,787యూరోలు) చొప్పున చెల్లించాల్సి ఉందని..ఇప్పటివరకు కేవలం 2,715 యూరోలు మాత్రమే చెల్లించారని కోర్టుకు తెలిపాడు. ఈ నేపథ్యంలో దీనిపై విచారించిన కోర్టు మల్లికాశెరావత్ అపార్ట్‌మెంట్‌లో ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

అయితే, ఈ వార్తలను మల్లికా శెరావత్ కొట్టిపారేశారు. తాము పారిస్‌లో ఎలాంటి ప్లాట్ అద్దెకు తీసుకోలేదని, లేదా సొంతానికి కూడా లేదని ఆమె పేర్కొన్నారు. ‘నేను ఇదివరకే చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. నేను గత ఎనిమిది నెలల నుంచి అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ఉంటున్నాను. నాకు అసలు పారిస్‌లో ఫ్లాటే లేదు. అద్దె ఎగ్గొట్టడంతో నన్ను ఇంటి నుంచి గెంటేశారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి రూమర్స్ సృష్టించకండి’ అని క్లారిటీ ఇచ్చింది

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

tr> tr> tr> tr> tr> tr>
జై సింహ JAN 12
రంగుల రాట్నం JAN 12
గ్యాంగ్ JAN 12
మనసుకు నచ్చింది JAN 26
చలో FAB 2
తొలిప్రేమ FAB 9
భాగమతి
ఆచారి అమెరికా యాత్ర
టచ్ చేసి చూడు

Now Showing

అజ్ఞాతవాసి JAN 10

Poll