టాలీవుడ్

వైయస్ ఆర్ బయోపిక్ కు రంగం సిద్దం,సీన్ లోకి సూపర్ స్దార్

ysr4ప్ర‌స్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా ఎలక్షన్స్ దగ్గర పడుతూండటంతో పోటీ పడి మరీ రాజకీయనాయకులకు చెందిన బయోపిక్ లు తెరకెక్కే పని పెట్టుకున్నాయి. అలా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల‌లో విశ్వ విఖ్యాత న‌ట‌స‌ర్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు బ‌యోపిక్‌కి సంబంధించి మూడు ప్రాజెక్టులు జ‌రుగుతున్నాయి. ముగ్గురు ద‌ర్శ‌కులు ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి తెర‌కెక్కించాల‌ని రంగం సిద్ధం చేసుకోగా, ఈ మూడు ప్రాజెక్టులు విభిన్న క‌థాంశాంతో రూపొంద‌నున్న‌ట్టు తెలుస్తుంది.

మరోవైపు సావిత్రి.. పుల్లెల గోపీచంద్ లపై కూడా సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు వైఎస్ ఆర్ జీవితాన్ని కూడా మూవీగా మలిచే ప్రాజెక్టు సాకారం కానుందని తెలుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోక ముందు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ అకాల మరణం చెందారు. ఇప్పుడు ఆయ‌న‌పై కూడా ఓ బ‌యోపిక్ రూపొందించాల‌ని ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

ఆనందో బ్రహ్మ చిత్రంతో సక్సెస్ సాధించిన దర్శకుడు మహి రాఘవ.. వైఎస్ ఆర్ చిత్రానికి స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుని.. ప్రస్తుతం నటీనటుల వేటలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే వైఎస్ ఆర్ పాత్ర‌కి మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టిని తీసుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట ద‌ర్శ‌కుడు. ఇందుకోసం మ‌మ్ముట్టితోను చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంద‌ని టాక్‌. ఇ

క వైఎస్ఆర్ బ‌యోపిక్ రూపొందించేందుకు వైఎస్ త‌న‌యుడు జ‌గ‌న్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపుదిద్దుకుంటున్న వేళ వైఎస్ ఆర్ బ‌యోపిక్‌కి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్‌గా నిలిచాయి.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16