బాక్స్ ఆఫీస్

మహేషా..మజాకా… మొదలెట్టగానే మెదలైంది

mahesh‘శ్రీమంతుడు’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘భరత్ అనే నేను’ టైటిల్ ఖరారు చేసి షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభించారు. ‘శ్రీమంతుడు’లో గ్రామాల దత్తత అంశం చూపించిన కొరటాల తాజా సినిమాలో ఎలాంటి కథను చూపిస్తారో అనే ఆసక్తి మహేశ్ ఫ్యాన్స్‌లో నెలకొంది.

ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ‘స్పైడర్’ ఇంకొద్ది రోజుల్లో ముగియనుండగా ‘భరత్ అనే నేను’ ఈ మధ్యే మొదలైంది. ఇలా షూటింగ్ మొదలైందో లేదో అప్పుడే ఈ సినిమాకు బిజినెస్ పరంగా భారీ ఆఫర్స్ వస్తున్నాయని మీడియాలో టాక్ మొదలైంది. మహేష్ – కొరటాల కలయికలో వచ్చిన ‘శ్రీమంతుడు’ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో కూడా మంచి క్రేజ్ నెలకొంది.

అందుకే కొందరు ఏపి, తెలంగాణ హక్కుల్ని రూ. 80 కోట్ల ఔట్ రేట్ ధరకు అడుగుతున్నారని చెప్పుకుంటున్నారు. అలాగే హిందీ, తమిళం, ఓవర్సీస్, మలయాళం హక్కులన్నీ కలిపి రూ.40 కోట్లు పలుకుతున్నాయట. దీన్నిబట్టి చూస్తే త్వరలో విడుదలకానున్న ‘స్పైడర్’ గనుక మంచి విజయాన్ని సాధిస్తే ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశముందని నిర్మాత డీల్స్ ఫైనల్ చేయకుండా ఆగుతున్నట్లు సమాచారం.

మహేష్ సరసన కొత్త నటి కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018 ఆరంభంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll