టాలీవుడ్

మహేష్ ఫాన్స్ రెడీగా వుండండి “the vision of bharat” ఫస్ట్ లుక్ ఈరోజే

మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ ఎప్పుడా? అని ఎదురుచూస్తున్న ఫస్ట్‌లుక్‌ “The vision of bharat”ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారని చిత్ర యూనిట్ అఫిషియల్ ట్విటర్ ఆకౌంట్ ద్వారా ప్రకటించారు.

ఇక సామాజిక అంశాలను తెరపై చూపించడంలో దర్శకుడు కొరటాల శివ దిట్ట. ‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్‌’ ఈ కోవకి చెందినవే. చెట్లను పెంచాలని పర్యావరణాన్నిరక్షించుకోవాలని ‘జనతా గ్యారేజ్‌’లో చూపించారు. గ్రామాలను దత్తత తీసుకుని పేదవారికి సాయం చేయాలన్న సందేశాన్ని ‘శ్రీమంతుడు’లో ఇచ్చారు.

ఇప్పుడు కొరటాల శివ-మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వస్తనన్న ‘భరత్‌ అనే నేను’ సినిమాలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో నటించనున్నారు. చదువు విషయంలో ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఓ సీఎంగా మహేశ్‌ ఏం చేశాడు అన్న కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఈ చిత్రంలో దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది అన్న విషయాన్ని ప్రధానంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేశ్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ నటిస్తోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 2018 ఏప్రిల్‌లో 27 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments

Needi Naadi Oke Katha

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2