కోలీవుడ్

‘స్పైడర్‌’ లో ఆ సీన్స్ చూస్తే… నవ్వొచ్చేసింది: మహేష్‌బాబు

Spyder Audio Launch final Image 2017-09-09 at 101504978921.26.46 PM‘‘పదేళ్ల క్రితం ఎస్‌.జె. సూర్య దర్శకత్వంలో ‘నాని’ సినిమా చేశా. ఆ సినిమా చేశాక కూడా మామధ్య దర్శకుడు, నటుడు అనే బంధం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ చిత్రంలో హీరో – విలన్‌గా నటించాం. క్లైమాక్స్‌లో ఇద్దరం ఒకరిని ఒకరు పగతో చూసుకొనే సన్నివేశాలు చూస్తే… నవ్వొచ్చేసింది.’’అన్నారు మహేష్ బాబు.

మహేష్‌బాబు హీరోగా నటించిన చిత్రం ‘స్పైడర్‌’. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కింది. మురుగదాస్‌ దర్శకుడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. ఠాగూర్‌ మధు, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. హారీశ్‌ జయరాజ్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు శనివారం రాత్రి చెన్నైలో విడుదలయ్యాయి. తొలి సీడీని పీటర్‌ హెయిన్స్‌ సతీమణి పార్వతి, ఏఆర్‌ మురుగదాస్‌ భార్య రమ్య, హారీశ్‌ జయరాజ్‌ అర్ధాంగి సుమ సంయుక్తంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ ‘‘‘పద్దెనిమిదేళ్ల కెరీర్‌లో ‘స్పైడర్‌’ ఓ కొత్త అనుభూతి ఇచ్చింది. తొలి సినిమా చేస్తున్నానేమో అనిపిస్తోంది. మురుగదాస్‌తో సినిమా అనేది పదేళ్ల కల. చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకొన్నాం. ఓసారి ఆయన ఇంటికొచ్చి కథ కూడా వినిపించారు. అప్పుడు ఏ కథైతే చెప్పారో, ఇప్పుడు అదే కథని తెరకెక్కించారు. రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. అంత స్థాయిలో సినిమాని నిర్మించడానికి కూడా గట్స్‌ ఉండాలి. ఈ విషయంలో నిర్మాతల్ని అభినందిస్తున్నా. హారీస్‌ సంగీతం, పీటర్‌ హెయిన్స్‌ ఫైటింగులు ప్రధాన బలం. ఫలానా సినిమా చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు. నాకన్నీ మంచి అవకాశాలే వచ్చాయి. ‘తుపాకి’ మాత్రం తెలుగులో రీమేక్‌ చేయాలనిపించింది. అప్పట్లో కుదర్లేదు. నా కెరీర్‌లోనే బాగా నచ్చి చేసిన సినిమా ఇది. తెలుగు రాష్ట్రాలలో వూహించని స్థాయిలో అభిమానుల్ని ఇచ్చాడు దేవుడు. ఈ జన్మకు ఇది సరిపోతుంది. నా సినిమాల్లో అత్యుత్తమం ఏదని అడిగితే ‘స్పైడర్‌’ పేరే చెబుతా’’ అన్నారు మహేష్‌.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll