టాలీవుడ్

ఇదికదా టీజర్ అంటే మహేష్ పవర్ అంటే ‘భ‌ర‌త్ అనే నేను’ టీజర్ సూపర్

“చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే.. యు ఆర్ నాట్ కాల్డ్ ఏ మ్యాన్ అని. ఇప్పటికీ ఆ మాట తప్పలేదు. మరిచిపోలేదు.
నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజొకటొచ్చింది. పెద్దదే కాదు. కష్టమైంది కూడా.
భరత్ అనే నేను..

ఎంత కష్టమైనా ఆ మాట తప్పలేదు. బీకాజ్ ఐమామ్ ఏ మ్యాన్. వుయ్ లివింగ్ అవర్ సొసైటీ. ప్రతి ఒక్కరికి భయం, బాధ్యత ఉండాలి.
ప్రామిస్.. ’’ అంటూ మహేష్ బాబు తన కొత్త చిత్రం టీజర్ తో వచ్చేసారు

మ‌హేష్ బాబు తాజా చిత్రం ‘భ‌ర‌త్ అనే నేను’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా న‌టిస్తోంది. డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ కొద్ది సేపటి క్రితమే రిలీజైంది.

ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. మార్చి 27 నాటికి చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంద‌ని.. ఏప్రిల్ 26న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి ఈ చిత్రాన్ని తొలుత ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇప్పుడు ఒక రోజు ముందుగా ఈ సినిమాని విడుద‌ల చేయ‌బోతున్నార‌న్న‌మాట‌. అదే రోజు(ఏప్రిల్ 26)న‌ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కూడా విడుద‌ల‌వుతోంది. బ‌న్ని చిత్రానికి కూడా తొలుత ఏప్రిల్ 27నే విడుద‌ల తేదిగా భావించారు. అయితే, ర‌జ‌నీకాంత్ ‘కాలా’ ఏప్రిల్ 27న విడుద‌ల కానుండ‌డంతో.. ఈ రెండు సినిమాలు ఒక రోజు ముందుగా రిలీజ్ కాబోతున్నాయి.

కొరటాల శివ తీసిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. అలాగే కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పొలిటికల్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2