టాలీవుడ్

‘భరత్ అనే నేను’ టీమ్ కి అవమానం..! షూటింగ్ కు నో

mahesh-koratalaతన కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘స్పైడర్’ పనుల్ని దాదాపు సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మొన్నటి వరకు హైదారాబాద్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలో కొత్త షెడ్యూల్ కోసం లక్నో వెళ్లారు. ఈ షెడ్యూల్ 10 వ తేదీ నుండి 22వ తేదీ వరకు ప్లాన్ చేసారు. అక్కడి జహాంగీరాబాద్ ప్యాలెస్, నాద్వా కాలేజ్, లక్నో యూనోవర్సిటీ వంటి వాటిల్లో షూట్ చేద్దామనుకున్నారు. అయితే అక్కడ ఈ చిత్రం టీమ్ కు ఊహించని అవాంతరం ఎదురైందని తెలుస్తోంది.

ఈ సినిమాలో మహేష్ ‌.. ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని కీలక యాక్షన్‌ సన్నివేశాలను ఉత్తర్‌ప్రదేశ్‌లోని మూసాబాఘ్‌, జహంగీరాబాద్‌ ప్యాలెస్‌ వంటి చరిత్రాత్మక ప్రాంతాల్లో షూటింగ్ చేయాని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
అయితే షూటింగ్ కు ఏఎస్‌ఐ(ఆర్కియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా)అధికారులు ఒప్పుకోలేదట.

యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించే క్రమంలో భవనాలు దెబ్బతినే అవకాశం ఉందని అందుకే షూటింగ్‌కి ఒప్పుకోలేదని చిత్రవర్గాల సమాచారం. ఈ చిత్రంలో మహేష్ ‌కి జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ కైరా అడ్వాణీ నటిస్తోంది. ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. డివివి దాన్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll