టాలీవుడ్

అతిలోక సుందరి మృతిపై సినిమా జనం స్పందన ఇదీ…

ఐదు పదులు దాటిన శ్రీదేవి చివరి రోజు దాకా అతిలోకసుందరిగానే వెలుగొందింది. అలాంటి వన్నెతరగని అందం భువిని వదలి దివికేగింది. ఆమె హఠాత్‌ మరణాన్ని అభిమానులే కాదు, ఆమె సహ నటులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆమె మరణ వార్త విని సినీ ప్రముఖులు ఎవరేమన్నారో చూడండి.

శ్రీదేవి మృతి నన్ను కలిచివేసింది. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించినప్పట్నుంచీ శ్రీదేవితో పరిచయం ఉంది. పదహారేళ్ల వయసు నుంచి జగదేకవీరుడు అతిలోక సుందరి వరకు తనతో చాలా సినిమాలు తీశాను. శ్రీదేవి చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో ఎదుగుతూ వచ్చింది. – సీనియర్‌ దర్శకుడు కె.రాఘవేంద్రరావు

* రాజమౌళి: ‘ఈ బాధాకర వార్త విని దిగ్భ్రాంతి చెందాను. శ్రీదేవి తొలి‌ లేడీ సూపర్‌స్టార్‌. 54 ఏళ్ల వయసుకే నటిగా 50 ఏళ్లు రాణించడం అద్భుతం. ఎంత చక్కటి ప్రయాణం.. ఊహించని ముగింపు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’.

* ఆమిర్‌ ఖాన్‌: ‘శ్రీదేవి మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె నటనకు, స్వభావానికి పెద్ద అభిమానిని. ఆమె కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా. ఆమె లక్షలాధి మంది అభిమానుల్లో ఒకడిగా నివాళులర్పిస్తున్నా. ప్రేమ, గౌరవంతో మిమ్మల్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకునే ఉంటాం మామ్’.
* మహేశ్‌బాబు: ‘శ్రీదేవి మరణవార్త తెలిసి షాక్‌ అయ్యా, చాలా విచారంగా ఉంది. ఆమె అద్భుతమైన నటి, మహిళ. ఎప్పటికీ నా అభిమాన నటి.. త్వరగా వెళ్లిపోయారు. ఆమె కుటుంబానికి, శ్రేయోభిలాషులకు తట్టుకునే బలం ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’.
* శ్రీదేవి అందం, అభినయంతో అందరినీ మెప్పించారు. ముంబయి వెళ్లినప్పుడల్లా శ్రీదేవి కుటుంబంతో మాట్లాడేవాడిని. ఆమె చిన్నప్పటి నుంచి చాలా ఆరోగ్యంగా ఉండేవారు. -సినీ నిర్మాత సి.అశ్వనీదత్‌
* శ్రీదేవి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. తను బాలనటిగా ఉన్నప్పటి నుంచీ నాకు తెలుసు అందరితోనూ ఎంతో చలాకీగా ఉండేది. – చంద్రమోహన్‌
* శ్రీదేవి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. బాలనటిగానే ఆమె ఎన్నో చిత్రాలు చేశారు. ఆమె లేని లోటు తీర్చలేనిది. – మురళీమోహన్‌
* ‘వచ్చారు, చూశారు, గెలిచారు. స్వర్గం నుంచి వచ్చారు. అక్కడికే తిరిగి వెళ్లిపోయారు’- జూ.ఎన్టీఆర్‌
* టీనేజ్‌ నుంచి గొప్ప నటిగా ఎదిగిన శ్రీదేవిని చూశాను. స్టార్‌డమ్‌కు ఆమె అర్హురాలే. ఆమె చనిపోయిందని తెలియగానే ఆఖరిసారి నేను శ్రీదేవిని కలిసిన జ్ఞాపకాలన్నీ ఒక్కసారి నా కళ్ల ముందు మెదిలాయి. ‘సద్మా’ చిత్రంలోని లాలిపాట ఇంకా వినపడుతూనే ఉంది. మనం శ్రీదేవిని చాలా మిస్సవుతాం’- కమల్‌హాసన్‌
* ‘శ్రీదేవి చనిపోయారని తెలిసి చాలా షాకయ్యాను. ఓ మంచి స్నేహితురాలిని కోల్పోయాను. చిత్ర పరిశ్రమ గొప్ప నటిని కోల్పోయింది. శ్రీదేవి కుటుంబం ఎంత బాధపడుతోందో నేనూ అంతే బాధపడుతున్నాను’- రజనీకాంత్‌
‘శ్రీదేవి సినిమాలు చూస్తూ పెరిగాం. శ్రీదేవి మన మధ్య లేరనే విషయాన్ని జీర్జించుకోలేకపోతున్నా. నాకు మాటలు రావడం లేదు. ఎలా స్పందించాలో తెలియడం లేదు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’- సచిన్‌ తెందూల్కర్‌
* ‘మాటలు కూడా రావడం లేదు’- సుమంత్‌
* ‘నమ్మలేకపోతున్నాను. మాటలు రావడం లేదు. అందమైన అమ్మ. బోనీ కపూర్‌, జాన్వి, ఖుషి ధైర్యంగా ఉండాలి’- పరిణీతి చోప్రా
* ‘నాకెంతో ఇష్టమైన నటి. చనిపోయారంటే నోట మాట రావడం లేదు’- జయం రవి
* ‘షాకింగ్‌. త్వరగా వెళ్లిపోయారు’- రణ్‌దీప్‌ హుడా
* ‘ఓ నటిగా ఎప్పటికీ ఆమె వెలుగుతూనే ఉంటారు.’- అదితి రావ్‌ హైదరి
* ‘షాకింగ్. చాలా అంటే చాలా త్వరగా వెళ్లిపోయారు. బాధాకరం’- అను ఇమ్మాన్యుయేల్‌
* ‘శ్రీదేవి చనిపోయారని తెలిసి షాకయ్యాను. ఆమె కుటుంబం ధైర్యంగా ఉండాలి’- నాగబాబు
* ‘బాధగా ఉంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’- రాశీ ఖన్నా
* ‘శ్రీదేవి మరణవార్త విని గుండె పగిలిపోయింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమె కుటుంబం ధైర్యంగా ఉండాలి’- రమ్యకృష్ణ
* ‘ఇది నిజం కాకూడదని అనుకుంటున్నాను. శ్రీదేవి చనిపోవడం నిజంగా చాలా బాధాకరం’- నితిన్‌
* ‘నాకెంతో ఇష్టమైన నటి శ్రీదేవి చనిపోయారంటే నమ్మలేకపోతున్నాను. జీర్ణించుకోలేకపోతున్నాను’- కాజల్ అగర్వాల్‌
* ‘శ్రీదేవి చనిపోయారని తెలిసి షాకయ్యాను. అసలు అనుకోలేదు. ఆమె నటనతో చాలా మందిని ప్రభావితం చేశారు. అద్భుతమైన నటి. చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.’- హేమమాలిని
* ‘యావత్‌ భారతదేశానికి ఈరోజు బ్లాక్‌డే.’- కల్యాణి ప్రియదర్శన్‌
* ‘శ్రీదేవి చనిపోవడం చాలా బాధాకరం. ఆమె కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలి’- వెంకటేశ్‌
* ‘శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలి’- నాగార్జున
* ‘చిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటు. శ్రీదేవి గారు చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.’- రవితేజ
* ‘తప్పు చేశావ్‌ దేవుడా..ఆమెది చిన్న వయసే.’- సుధీర్‌ బాబు‘‘మా బ్యానర్‌లో మొదటి సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి తో తీసిన ‘మకుటం లేని మహారాజు’ లో శ్రీదేవి హీరోయిన్. ఆమెతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. శ్రీదేవి లేరన్న వార్తని నమ్మలేకపోతున్నాను. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ’’- బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ (శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర)
‘‘శ్రీదేవి లేని లోటు తీర్చ‌లేద‌ని. వారి కుటుంబానికి తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుతం త‌రుపున ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నా’’ -రాష్ర్ట సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్

* అజయ్‌ దేవగణ్‌: ‘ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. ఆమె నిజంగా గొప్ప నటి. షాక్‌లో ఉన్నా’.

* అల్లు అర్జున్‌: ‘ప్రముఖ నటి శ్రీదేవి మృతి చెందడం దిగ్ర్భాంతికి గురి చేసింది. నిజంగా చాలా చెడువార్త. ఆమె కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు సానుభూతి తెలుపుతున్నా’.

* రకుల్‌ప్రీత్‌ సింగ్: ‘దీన్ని నేను నమ్మలేను.. షాకింగ్‌. లెజెండరీ నటి ఇకలేరు. భారత చిత్ర పరిశ్రమలో ఆమె స్థానం, ఖ్యాతి చెరిగిపోనిది. ఆమె కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. ఇద్దరు కుమార్తెలకు తట్టుకునే శక్తి రావాలి’.

* ఎ.ఆర్‌. రెహమాన్‌: ‘శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆమె కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నా’.

* శ్రుతిహాసన్: ‘హృదయ విదాకరమైన వార్త. ఈ భయంకరమైన విషయాన్ని నమ్మలేకపోతున్నా. మాటలు రావడం లేదు’.

* హన్సిక: ‘శ్రీదేవి కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’.

* సాయిధరమ్‌ తేజ్‌: ‘అందమా అందుమా.. అందనంటి అందమా.. మీరు అందనంత చోటుకు వెళ్లిపోయారు.. మిమ్మల్ని కోల్పోయాం శ్రీదేవి’.

* పరుచూరి గోపాలకృష్ణ: ‘ఇంద్రుడికి కన్ను కుట్టింది. ఇంతటి సౌందర్యరాశి భూలోకంలో ఉండటం ఏమిటని సురులకు అసూయ పుట్టింది. అందుకే మన శ్రీదేవిని తీసుకువెళ్లిపోయారు. ఆమె ఆత్మకు శాంతి కలుగుగాక’.

* వంశీ పైడిపల్లి: ‘శ్రీదేవి మరణించి ఉండొచ్చు.. కానీ మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు’.

* స్నేహా ఉల్లాల్‌: ‘శ్రీదేవి మరణవార్త నిజం కాదని చెప్పండి. ఇది జరగలేదని చెప్పండి’.

* అనుష్క శర్మ: ‘షాక్‌ అయ్యా. మాటలు రావడం లేదు. శ్రీదేవి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నా’.

* శ్రీదేవి మరణం భారతీయ చిత్రసీమకు తీరని లోటు: మోహన్ బాబు
‘శ్రీదేవి కుటుంబంతో నాకు తిరుపతిలోనే మంచి అనుబంధం ఉంది. ఆమె తల్లి తిరుపతికి చెందినవారు. శ్రీదేవితో కలిసి చాలా సినిమాల్లో నటించాను. భారతీయ చిత్రసీమ మంచి నటిని మాత్రమే కాదు, ఉన్నతమైన వ్యక్తిని కూడా కోల్పోయింది. నా 42వ సినీ జీవిత ఉత్సవాలు విశాఖపట్నంలో జరుగుతున్నప్పుడు కేవలం ఫోన్ చేయగానే వైజాగ్ వచ్చి, ఆ వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోనిబ్బరాన్ని ఆ శిరిడీ సాయినాథుడు ప్రసాదించాలని కోరుకొంటున్నాను’.

* శ్రీదేవి హఠాన్మరణం బాధాకరం: బాలకృష్ణ
‘శ్రీదేవితో నాన్న చాలా సినిమాల్లో నటించారు. ఎలాంటి భావాన్నైనా కళ్ళతోనే పలికించగల మహానటి శ్రీదేవి. ఆవిడ హఠాన్మరణం చిత్రసీమకు తీరనిలోటు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని వేడుకొంటున్నాను’.

* శ్రీదేవి కుటుంబంతో నా అనుబంధం మరువలేనిది: ఏ.ఎం.రత్నం
‘శ్రీదేవితో నా అనుబంధం ఈనాటిది కాదు. నా సూపర్ హిట్ సినిమాల్లో ఎక్కువగా హిందీలో రీమేక్ చేసింది బోనీ కపూరే. ముంబయి వెళ్ళినప్పుడల్లా శ్రీదేవి ఇంటికి వెళ్లకుండా ఎప్పుడూ వెనుదిరగలేదు. అటువంటి మంచి మనిషి, అద్భుతమైన నటి నేడు మన మధ్య లేదన్న చేదు నిజాన్ని దిగమింగడం చాలా కష్టంగా ఉంది’.

Comments

comments

Needi Naadi Oke Katha

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2