టాలీవుడ్

‘మాయాబజార్‌’ స్టైల్ లో ‘మహానటి’ లోగో విడుదల

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మితమ‌వుతున్న ఈ సినిమాని ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్‌ నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. బుధవారం సావిత్రి జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్‌ లోగోకు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

ఇందులో ‘మాయాబజార్‌’లోని పేటికను చూపించారు. దాన్ని ఓ మహిళ తెరిచారు. అందులోంచి ‘మహానటి’ అనే టైటిల్‌ బయటికి వచ్చింది. ఈ సన్నివేశాన్ని పక్కన పెడితే బ్యాక్‌గ్రౌండ్‌లో.. ‘అది ప్రియదర్శిని వదినా.. ఆ పేటిక తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తువు వారికి కనిపిస్తుంది, మీకు పెళ్లైందా.. అయితే నన్ను చేసుకుంటారా?, అయ్యోరామ, నమో కృష్ణ, అలిగిన వేళనే చూడాలి, నన్ను వదిలి నీవు పోలేవులే, ఈ నాటి ఈ బంధం ఏనాటిదో..’ అంటూ సావిత్రి సినీ కెరీర్‌కు సంబంధించిన డైలాగ్స్‌, పాటలను వినిపించారు. ఇలా చాలా ఆసక్తికరంగా ఈ వీడియోను రూపొందించారు.

సమంత, విజయ్‌ దేవరకొండ, విక్రమ్‌ ప్రభు, షాలిని పాండే, ప్రకాశ్‌రాజ్‌, మోహన్‌బాబు ‘మహానటి’లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మార్చి 29న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll