కోలీవుడ్

విజయ్ ‘మెర్సల్’ కు హైకోర్ట్ స్టే,టీమ్ షాక్

Mersalఇలయ దళపతి విజయ్ .. థేరి సినిమా తర్వాత అట్లీతో చేస్తున్న చిత్రం మెర్సల్. విజయ్ 61వ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ మూడు భిన్న పాత్రలలో కనిపించనున్నాడు. సమంత, నిత్యామీనన్, కాజల్ కథనాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగులో అదిరింది అనే టైటిల్‌తో రిలీజ్ కానుంది. కమర్షియల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. అయితే తాజాగా మెర్సల్ చిత్ర టీజర్ విడుదల చేస్తే, లైకుల పరంగా ప్రపంచ రికార్డు సాధించింది.

దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాజకీయ నాయకుడిగా, మెజీషియన్‌గా,డాక్టర్‌గా విజయ్ ఈ చిత్రంలో కనిపిస్తాడనేసరకి అభిమానులు అనేక ఊహాగానాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి అనుకోని షాక్ తగిలింది. మెర్సల్ టైటిల్ నేను 2014లో రిజిస్టర్ చేసుకోగా, నిబంధనలకి విరుద్ధంగా తన టైటిల్‌ని వాడేస్తున్నారని ఓ వ్యక్తి చెన్నై కోర్టులో పిటీషన్ వేశాడు.

ఈ ఫిర్యాదుని పరిశీలించిన కోర్టు అక్టోబర్ 3వరకు సినిమాని ప్రమోషన్స్ చేయోద్దంటూ ఆర్డర్ పాస్ చేసిందట. అంటే దాదాపు 10 రోజుల పాటు చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ చేయకూడదన్నమాట. ఇది సినిమాపై ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మెర్సల్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, సమంత, నిత్యామీనన్, కాజల్ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ సినిమాను తెలుగులో నిర్మాత శరత్‌ మరార్‌ విడుదల చేయబోతున్నారు. శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎస్ జే.సూర్య, సత్యరాజ్, వడివేలు, సత్యన్, కోవైసరళ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Comments

comments

Trending

Latest

Trailer

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll