‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ని సొంతం చేసుకున్న పవన్ కల్యాణ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.. క్రేజీ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి వస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా తెరపైకి రానున్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా .. . ‘అజ్ఞాతవాసి’ సినిమా కథని ‘ది హెయిర్ అప్పారెంట్’(లార్గో వించ్) అనే ఓ ఫ్రెంచ్ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని తీసారంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ‘లార్గో వించ్’ హక్కుల్ని టి-సిరీస్ ఎప్పుడో సొంతం చేసుకుంది. దాంతో ఈ వివాదాన్ని పరిష్కరించటానికి దగ్గుపాటి రానా సీన్ లోకి దిగాడంటూ కూడా కథనాలు వచ్చాయి.
ఇదిలా ఉంటే…టి-సిరీస్ ముందుగా ఈ హక్కుల్ని కలిగి ఉండడంతో వారి అనుమతి లేకుండా ‘అజ్ఞాతవాసి’ని నిర్మించినందుకు గాను…రూ. పది కోట్లు నష్ట పరిహారం చెల్లించి సినిమాని విడుదల చేసుకోమని కోరుతున్నారని సమాచారం. ఇంత భారీ మొత్తం చెల్లించలేని ఫిలిం మేకర్స్ అయిదు కోట్ల రూపాయిలతో సమస్యని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిపై చిత్ర నిర్మాత ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ విషయాలపై అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు.
‘ది హెయిర్ అప్పారెంట్’చిత్రం‘లార్గో వించ్’ అనే సినిమా బెల్జియన్ కామిక్ నావెల్ ఆధారంగా తెరకెక్కింది. దాని కథలోకి వెళ్తే.. ఓ కోటీశ్వరుడి కొడుకైన లార్గో సీక్రెట్‌గా పెంచబడతాడు. అదికూడా తండ్రికి చాలా దూరంగా ఓ అజ్ఞాత ప్రదేశంలో అతని పెంపకం సాగుతుంది. కొన్ని సంవత్సరాల గడిచిన అనంతరం లార్గో తండ్రి శత్రవుల చేతిలో చంపబడతాడు. ఈ విషయం తెలుసుకున్న లార్గో.. తన తండ్రి రాజ్యాన్ని పాలిస్తూ, శత్రువుల పనిబడతాడు. ఈ సినిమా ట్విస్టులు, రొమాన్స్, యాక్షన్ సీన్లు అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అయినా ఎందుకో ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకోలేకపోయింది. క్రిటిక్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసినా.. కమర్షియల్‌గా మాత్రం ఫ్లాప్‌గా నిలిచింది.