టాలీవుడ్

మంచు లక్ష్మి నటించిన హాలీవుడ్ చిత్రం ట్రైలర్ ఇదిగో

తెలుగు చిత్ర పరిశ్రమలో విల‌క్ష‌ణ న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు ల‌క్ష్మి ఇప్ప‌టికే లాస్ వేగాస్, ఈఆర్, డెస్ప‌రేట్ హౌస్ వైఫ్ లాంటి టెలివిజ‌న్ సీరియ‌ల్స్‌తో పాటు, హాలీవుడ్ సినిమాల్లోనూ న‌టించింది.

మ‌ళ్లీ చాలా రోజుల త‌ర్వాత మంచు ల‌క్ష్మి హాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లో చేస్తున్న సినిమా బాస్మ‌తి బ్లూస్. ఈ సినిమా షూటింగ్ కూడా ఎక్కువ భాగం ఇండియాలోనే జ‌రిగింది. ఇటీవల అమెరికా వెళ్ళిన లక్ష్మి ఈ సినిమాకు సంబంధించిన తన డబ్బింగును కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ద‌శ‌లో ప‌నులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఆమె ఓ రైతుగా కనిపిస్తుంది.

ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. దీన్ని మంచు లక్ష్మి ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘నా కొత్త హాలీవుడ్‌ సినిమా త్వరలో విడుదల కాబోతోంది’ అని ట్వీట్‌ చేశారు.

డాన్‌ బారన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్టీవెన్‌ అర్గిలా స్వరాలు అందించారు. బ్రీ లార్సన్‌, ఉత్కర్ష్‌ అంబుద్కర్‌, మంచు లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. షౌట్‌ ఫ్యాక్టరీ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫిబ్రవరి 9న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

విదేశానికి చెందిన ఓ శాస్త్రవేత్త తను జన్యుపరంగా మార్పు చేసిన వరి ధాన్యాన్ని అమ్మడానికి భారత్‌కు వస్తుంది. ఆ ధాన్యంతో రైతులకు మేలు జరుగుతుందని భావిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడి అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఆ ధాన్యం వల్ల రైతులకు మేలు జరిగిందా? లేదా? అనే విషయాన్ని తెరపై చూడాలి.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll