టాలీవుడ్

సుకుమార్ లేకుండా మ్యాజిక్ వర్కవుట్ అవుద్దా

raj‘కుమారి 24ఎఫ్‌’ వంటి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు అందించిన రాజ్‌తరుణ్‌, పల్నాటి సూర్య ప్రతాప్‌ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్‌కానుంది. ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు.

‘‘సూర్యప్రతాప్‌ చెప్పిన కథ ఎగ్జైటింగ్‌గా ఉంది. ‘కుమారి 21ఎఫ్‌’ తరహాలోనే యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతుంది. యువతను ఆకట్టుకునే అన్ని అంశాలతో ‘కుమారి 21 ఎఫ్‌’ను మించేలా ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలో ఇతర వివరాలు తెలియజేస్తాం’’ అని నిర్మాత రామ్‌ తాళ్లూరి తెలిపారు.

అయితే సూర్య ప్రతాప్ తొలి చిత్రం సుశాంత్ తో కరెంట్ అని చేస్తే అది వర్కవుట్ కాలేదు. అయితే ఆ తర్వాత సుకుమార్ స్క్రిప్టు అందించి, అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ‘కుమారి 24ఎఫ్‌’ని తెరపైకి తెచ్చారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. సుకుమార్ ఇమేజ్ కూడా సినిమా సక్సెస్ కు కలిసొచ్చింది. ఇప్పుడు సుకుమార్ లేకుండా కేవలం ఆ కాంబినేషన్ తో సినిమా మొదలవుతోంది.

దాంతో దర్శకుడు ఏ రేంజి మ్యాజిక్ చేస్తాడనే విషయం సినీ వర్గాల్లో చర్చగా మారింది. అయితే స్వతహాగా పల్నాటి సూర్య ప్రతాప్ చాలా టాలెంటెడ్ అని, అందుకే సుకుమార్ ఎంకరేజ్ చేసారని, ఇప్పుడు సుకుమార్ అండలేకుండానే అదే విషయం ప్రూవ్ చేస్తారని మరికొందరు ఆయన పరిచయస్దులు కామెంట్ చేస్తున్నారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 28
అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll