టాలీవుడ్

‘తొలిప్రేమ’ సినిమాపై కేటీఆర్‌ కామెంట్స్‌! విమర్శలు, ఆగ్రహం

ktr-tholi-premaవరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘తొలిప్రేమ’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం శనివారం విడుదలై హిట్ టాక్ తెచ్చకున్న సంగతి తెలిసిందే. కాగా..శనివారం రాత్రి ఈ సినిమాను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చూసారు. సినిమా బాగుందంటూ ట్విటర్‌ ద్వారా చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.

‘శనివారం రాత్రి సరదాగా గడిచిపోయింది. ‘తొలిప్రేమ’ సినిమా చూశాను. చాలా కాలం తరువాత తెలుగులో ఓ చక్కటి ప్రేమకథా చిత్రం చూశాను. దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా చాలా బాగా నటించారు’ అంటూ కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు.

అయితే ఈ ట్వీట్ పై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, విద్యార్థుల కష్టాలు పట్టించుకోకుండా సినిమాలు చూడ్డమేంటని ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి స్పందనగా.. పై వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. అంతేకాదు తన డీపీ కూడా మార్చేసుకున్నారు. అయితే డీపీ మార్చిన తర్వాత కూడా కేటీఆర్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

వారి వ్యవహార శైలితో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు చిర్రెత్తుకు వచ్చింది. తనకూ ఇష్టాయిష్టాలుంటాయంటూ వారిపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. సినిమాలు చూడటం.. డీపీలు మార్చుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఉన్నంత మాత్రాన వ్యక్తిగత జీవితం ఉండదా? అని ట్వీట్ చేశారు. ఇష్టమైతే ఉండండి.. లేకపోతే ట్విట్టర్‌లో తనను ఫాలో కావడం మానేయండని వాళ్లకు సూచించారు.

ఇదిలా ఉంటే కేటీఆర్‌ ట్వీట్‌పై రాశి ఖన్నా స్పందించారు. ‘మీకు సినిమా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సర్‌’ అని ట్వీట్‌ చేశారు. గతంలోనూ కేటీఆర్‌ ‘అర్జున్‌ రెడ్డి’, ‘ఫిదా’ తదితర చిత్రాలను చూసి చాలా బాగున్నాయంటూ ప్రశంసించారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

tr> tr>
అ! FEB 16
ఆచారి అమెరికా యాత్ర FEB 16
మనసుకు నచ్చింది FEB 16
కిరాక్ పార్టీ FEB

Now Showing

tr> tr>
తొలిప్రేమ FEB 10
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10