టాలీవుడ్

“కిరిక్ పార్టీ” ప్రీ రిలిజ్ బిజినెస్ అంతైందా?

Nikhil-Kirrak-Party-Movie-First-Look-Stills-6నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా “కిరిక్ పార్టీ”ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ తెలుగులో “కిరాక్ పార్టీ”గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శరణ్ కొప్పిశెట్టి అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తుండడం విశేషం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుండగాఇప్పటికే ఆడియో విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. అదే సమయంలో ఈ చిత్రానికి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం జరిగింది. ఆ వివరాలు మనం ఇక్కడ చూద్దాం.

నైజాం: 3.5 కోట్లు

సీడెడ్: 1.3 కోట్లు

ఆంధ్రా: 3.5 కోట్లు

మిగిలిన ప్రాంతాలు: 1.7 కోట్లు

మొత్తం థియోటర్ బిజినెస్ : 10 కోట్లు

నాన్ థియోటర్ బిజినెస్ : 5 కోట్లు

మొత్తం అన్ని కలిపి : 15 కోట్లు

ఖిల్ మాట్లాడుతూ.. “ “కిరాక్ పార్టీ” సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నా. మార్చి 16న థియేటర్స్ లో రచ్చ రచ్చ అయిపోతుంది. కన్నడలో ఇంత మంచి సినిమా ఒకటి ఉందని గుర్తించి.. నాకు ఈ కథలో నటించే అవకాశాన్ని అనిల్ సుంకర గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. “కార్తికేయ”తో చందు మొండేటి, “స్వామి రారా”తో సుధీర్ వర్మకు ఎలాంటి మంచి పేరు వచ్చిందో.. “కిరాక్ పార్టీ”తో శరణ్ కి కూడా అదే స్థాయి పేరొస్తుంది. ఎంటర్ టైన్మెంట్ తోపాటు మంచి మెసేజ్ కూడా ఉన్న సినిమా ఇది” అన్నారు.

హీరోయిన్ సిమ్రాన్ పరీంజా మాట్లాడుతూ.. “తెలుగులో నా మొట్టమొదటి అవకాశం “కిరాక్ పార్టీ” అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సాంగ్స్, ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాని కూడా అదే స్థాయిలో ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. “ ఈ చిత్రం కోసం వర్క్ చేసిన సుధీర్ వర్మ, చందు మొండేటిలకు ప్రత్యేక కృతజ్ణతలు తెలియజేసుకొంటున్నాను. కాలేజ్ లో షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వడమే కాక ఆడియో రిలీజ్ కి కూడా సహకరించిన ఉషారామా విద్యాసంస్థ యాజమాన్యానానికి కృతజ్ణతలు. మా టీం అందరూ ఎంతో కష్టపడి ఈ చిత్రంలో నటించారు.” అన్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2