టాలీవుడ్

పవన్‌కల్యాణ్ లవ్ లీ కోస్టార్

 

ఆ మ‌ధ్య ‘స్టాలిన్’ (2006) చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి అక్క‌గా న‌టించిన ఖుష్బూ.. మ‌ళ్లీ ప‌దేళ్ల త‌రువాత ఆయన సోదరుడు పవన్ సినిమాలో నటిస్తున్నారు. ఆమె న‌టిస్తున్న తెలుగు చిత్రం ‘అజ్ఞాత‌వాసి’. ఈ సినిమాకి సంబంధించి.. ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ చేశారు ఖుష్బూ. త్రివిక్రమ్‌తో ప‌నిచేయ‌డం చాలా ఆహ్లాదంగా ఉంటుంద‌ని.. అత‌నిలోని సింప్లిసిటీ, విధేయ‌త త‌న‌కు ఎంతగానో న‌చ్చాయ‌ని పేర్కొన్నారు. అలాగే వృత్తి ప‌ట్ల త్రివిక్ర‌మ్‌కి ఉండే ప్యాష‌న్‌.. న‌టీన‌టుల‌ను వాళ్ళ‌లోని బెస్ట్‌ని అందించేలా చేస్తుంద‌ని కితాబిచ్చారు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి సింపుల్‌గా.. ‘ప‌వ‌న్ ఓ ల‌వ్లీ కో-స్టార్‌’.. అంటూ ఒకే ఒక మాట‌లో చెప్పేశారు ఖుష్బూ.

‘కొందరిని విడిచి వెళ్తూ గుడ్‌ బై చెప్పాలంటే బాధగా ఉంటుంది. అలాంటి వారే ‘అజ్ఞాతవాసి’ యూనిట్‌ సభ్యులు. నా చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నా. ఇంత మంచి వ్యక్తులకు వీడ్కోలు చెప్పి వెళ్తుంటే నా కళ్ళు చెమర్చాయి. డీవోపీ మణికందన్‌ ప్రియమైన వ్యక్తి. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ ఆమె బరువెక్కిన హృదయంతో ట్వీట్‌ చేశారు.

మాటల మాంత్రికుడితో దిగిన సెల్ఫీని పోస్ట్‌ చేస్తూ.. ‘ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సింప్లిసిటీ, నటులను పోత్సహించి, వారి నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టుకునే విధానం నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ‘అజ్ఞాతవాసి’లో నటించే అవకాశం ఇచ్చినందుకు త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు. ప్రియమైన సహనటుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు పవన్‌కల్యాణ్‌.. మీ అందరినీ మిస్‌ అవుతున్నా’ అని ఆమె పేర్కొన్నారు.

కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయెల్‌ ‘అజ్ఞాతవాసి’లో కథానాయికలుగా నటిస్తున్నారు. బొమాన్‌ ఇరానీ, పరాగ్‌ త్యాగీ, రావు రమేశ్‌, సంపత్‌ రాజ్‌, మురళీశర్మ, వెన్నెల కిశోర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో DEC 29

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll