టాలీవుడ్

శ్రీదేవి మృతిపై ‘ఖలీజ్ టైమ్స్’ సంచలన కథనం

khalji-srideviశ్రీదేవి మృతిపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్‌లో ముద్రితమయ్యే ‘ఖలీజ్ టైమ్స్’ పత్రిక దీనిపై సంచలన కథనాలు ప్రచురించింది. శనివారం సాయంత్రం హోటల్ గదిలోని బాత్‌ రూంలో స్నానం చేస్తూ ఆమె అచేతనంగా పడి చనిపోయినట్లు ఆ పత్రిక కథనం. అసలు దుబాయ్‌లో ఏం జరిగింది.శ్రీదేవి బాత్ టబ్‌లో నిర్జీవంగా పడిపోయారా? స్నానం చేస్తున్నప్పుడే ఆమె గుండె ఆగిపోయి చనిపోయారా? అనే ప్రశ్నలను ఆ కథనం మన ముందు ఉంచే ప్రయత్నం చేసింది.

‘ఖలీజ్ టైమ్స్’ లో ప్రచురితమైన వార్త ప్రకారం..బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి దాదాపు నాలుగు రోజులు అక్కడే ఉన్నారు. ముంబైలో జరిగిన ఓ పుట్టిన రోజు వేడుక కోసం వెనక్కి వచ్చిన బోనీకపూర్ మళ్లీ శనివారం మధ్యాహ్నం దుబాయ్ చేరుకున్నారు. అయితే దుబాయ్‌కి తిరిగి వస్తున్న సంగతి శ్రీదేవికి బోనీకపూర్ చెప్పలేదు. నేరుగా ఆమె బస చేసిన ‘జువైరా ఎమిరేట్స్ టవర్స్’ హోటల్‌కు వెళ్లారు.

ఆమెను ఆశ్చర్యపరిచిన బోనీకపూర్… నిద్రపోతున్న శ్రీదేవిని సాయంత్రం 5:30 గంటల సమయంలో నిద్రలేపారు. ఎప్పుడొచ్చారు అని ఆశ్చర్చపోయిన శ్రీదేవి దాదాపు ఆయనతో 15 నిమిషాలు మాట్లాడారు. ఇద్దరు కలిసి డిన్నర్‌కు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో స్నానం చేసి వస్తానని చెప్పి శ్రీదేవి బాత్‌రూంలోకి వెళ్లారు. దాదాపు పావుగంటైనా ఆమె బాత్ రూం నుంచి బయటకు రాలేదు. దాంతో అనుమానం వచ్చిన బోనీ కపూర్ తలుపుతట్టారు. లోపల నుంచి మాట వినిపించలేదు. అలకిడి లేదు… స్నానం చేస్తున్న శబ్దం లేదు. దాంతో హోటల్ సిబ్బంది సాయంతో బోనీ కపూర్ తలుపు పగలకొట్టి చూశారు. బాత్ టబ్‌లో శ్రీదేవి అచేతనంగా పడి ఉండటం కనిపించింది. బోనీకపూర్‌ ఆమెను బతికించుకోవడానికి ప్రయత్నం చేశారని ‘ఖలీజ్ టైమ్స్’ కథనం.

దీన్ని బట్టి శ్రీదేవి రాత్రి 11:30 నిమిషాల సమయంలో చనిపోలేదని, ముందే 7:30 గంటలకు చనిపోయిందని ఖలీజ్ టైమ్స్ పత్రిక కథనం. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమె భౌతికకాయాన్ని పోస్టుమార్టం చేసేందుకు తీసుకెళ్లారని అర్దమవుతోంది. .అయితే దీనిపై శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

tr> tr>
ఆచారి అమెరికా యాత్ర MAR
కిరాక్ పార్టీ MAR

Now Showing

tr> tr>
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10