కోలీవుడ్

మా ‘ఖాకి’ పైరసీ ప్రింట్ చూడండి.. .నిర్మాత బహిరంగంగా సలహా

khakee poster 154విడుదలైన సినిమా పైరసీ అవుతోందంటే దాంతో తమ సినిమా కలెక్షన్స్ కు చాలా ఇంపాక్ట్ కలుగుతుందని నిర్మాతలు టెన్షన్ పడిపోతారు. పైరీసీ చూడవద్దని ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేస్తారు. పైరసీ చూసేవాళ్లను హెచ్చరిస్తారు. అయితే ఏ నిర్మాత అయినా ఆ వారమే విడుదలైన తన సినిమా పైరసీ వెర్షన్‌ను చూడమని సలహా ఎవరికైనా ఇస్తారా? కానీ ‘ఖాకి’ నిర్మాత ఎస్‌.ఆర్‌. ప్రభు మాత్రం ఆ పని చేసారు. పైరసీ వెర్షన్ చూడమని చెబుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే… ఈ వారం రిలీజైన 10 సినిమాల్లోను మంచి టాక్ తెచ్చుకుని థియేట‌ర్లలో స‌క్సెస్‌గా ర‌న్ అవుతున్న‌వి ఖాకి, గృహం మాత్ర‌మే. ముఖ్యంగా కార్తీ ఖాకి బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు రాబ‌డుతూ దూసుకుపోతోంది. పూర్తి స్దాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఖాకి సినిమాకు మాత్రం డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి. సినిమాకు మంచి టాక్ రావ‌డంతో పాటు పోటీ సినిమాలు కూడా లేక‌పోవ‌డం ఖాకికి బాగా క‌లిసొచ్చింది. అయితే ఈ సినిమా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి విడుదల కాలేదు. టాక్ బాగుండటంతో సినిమా చూడాలనే ఉత్సాహంతో ఓ సినిమా అభిమాని…నిర్మాతని ట్విట్టర్ లో ఈ విషయమే ప్రశ్నించాడు.

విదేశానికి చెందిన ఓ సినీ అభిమాని.. తమ ప్రాంతంలో ‘ఖాకి’ విడుదల కాలేదని, అక్కడి నుంచి సినిమాను ఎలా చూడాలని నిర్మాత ఎస్‌.ఆర్‌. ప్రభును ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. దీనికి నిర్మాత స్పందిస్తూ.. ఒక 25 రోజులు ఎదురుచూసి, అమేజాన్‌ ప్రైమ్‌లో చూడమని చెప్పారు. ‘అన్ని రోజులు ఎదురుచూడలేకపోతే ఆన్‌లైన్లో క్వాలిటీ ఉన్న పైరసీ వెర్షన్‌ను చూడండి. కానీ పైరసీ చూసే ముందు.. 10 డాలర్లను దానం చేయండి. నేను సంతోషిస్తా, మీరూ కూడా’ అని ప్రభు ట్వీట్‌ చేశారు.

నిర్మాత చెప్పిన ఈ సమాధానానికి ఆ వ్యక్తి ప్రతిస్పందిస్తూ.. ‘25 రోజులు ఎదురుచూసి, అమేజాన్‌ ప్రైమ్‌లోనే సినిమా చూస్తా. నేను పైరసీని ప్రోత్సహించను. అయినా సరే 10 డాలర్లు అవసరం ఉన్న వారికి ‘ఖాకి’ పేరు మీద దానం చేస్తా. సినిమా విజయం సాధించినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll