టాలీవుడ్

తోటి హీరోయిన్ విషయంలో ఇంత నీచంగా బిహేవ్ చేసిందా?

Kavya Madhavanప్రముఖ మలయాళ నటి భావనపై కారులో జరిగిన లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే స్టార్ హీరో దిలీప్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అత‌డి రెండో భార్య, సినీ నటి కావ్యామాధవన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ పోలీసు విచారణలో తాజాగా మరికొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించాడు.

నటిని వేధిస్తుండగా కారులో తీసిన ఫొటోలు, వీడియోలు ఆమె దగ్గర ఉన్నాయని అనుమానించారు. ఈ మేరకు కావ్యను కూడా విచారించారు. అయితే పల్సర్‌ సుని ఎవరో తనకు తెలియదని ఆమె చెప్పారు. అయితే ఆమె మాటల్లో నిజం లేదని పల్సర్‌ సుని తాజాగా ఆరోపించారు.

మంగళవారం పోలీసులు కున్నంకులం మెజిస్ట్రేట్‌ కోర్టుకు పల్సర్‌ సునిని తరలించారు. ఈ సందర్భంగా పల్సర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కావ్యకు తాను బాగా తెలుసని.. అయితే ఆమె అబద్ధం చెబుతోందని అన్నారు.

‘మేడం’ ఆదేశాల మేరకే భావనను కారులో లైంగికంగా వేధించి, బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు ఫొటోలు, వీడియోలు తీశానని తెలిపాడు. ఈ ఆదేశాలు ఇచ్చి, డబ్బులు సమకూర్చిన ‘మేడం’ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనని స్పష్టం చేశాడు. అయితే ఆమె ఆదేశాలు ఇవ్వడం, డబ్బు సమకూర్చడం మినహా మరేదీ చేయలేదని అన్నాడు.అయితే పల్సర్ సునీ ఎవరో తనకు తెలియదని కావ్యా మాధవన్ చెబుతుండడంపై అతను మండిపడ్డాడు. కావ్యకు తానెవరో తెలియదనడం మూర్ఖత్వమని, ఆమెకు తాను బాగా తెలుసని స్పష్టం చేశాడు. ఆమె అబద్ధమాడుతోందని పల్సర్‌ సునీ తెలిపాడు.

దిలీప్‌ మాజీ భార్య మంజూ వారియర్‌, వేధింపులకు గురైన నటి మంచి స్నేహితులు. పాత గొడవల నేపథ్యంలో దిలీప్‌.. పల్సర్‌ సునితో ఈ పని చేయించారని ఆరోపణలు ఉన్నాయి. దిలీప్‌ని ముద్దాయిగా నిరూపించే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు అంటున్నారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll