టాలీవుడ్

ఆ ప్రశ్న అడగగానే టీవీ లైవ్ నుంచి కత్తి వాకౌట్

mahesh-kattiపవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై విమర్శలు, ఫ్యాన్స్‌పై చురకలు అంటిస్తూ ప్రతి నిత్యం వార్తల్లో నిలిచే సినీ క్రిటిక్ కత్తి మహేష్‌కు డైరక్టర్ వివేక్ చుక్కలు చూపించారంటూ మీడియా హోరెత్తిస్తోంది. మహా టీవీ లైవ్ షోలో కత్తిని ఒకే ఒక ప్రశ్నతో కట్టడి చేశారంటూ సోషల్ మీడియా రెచ్చిపోతోంది.

ఇంతకీ ఏం జరిగింది?

ఎప్పటిలాగే కత్తి మహేష్ ఓ లైవ్ షోకు వెళ్లారు. అక్కడ డైరక్షన్ డిపార్టమెంట్ కు చెందిన వివేక్‌ వచ్చాడు. ఆయనకు కత్తి మహేష్ కు మధ్య జరిగిన లైవ్ షోలో.. పవన్ తరపున వివేక్ ఓ ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఐదు నిమిషాల పాటు మౌనం పాటించి కత్తి షో నుంచి వెళ్లిపోయాడు.

ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే? మీరు పవన్ గురించి మాట్లాడారు. ఆయన భార్య గురించి మాట్లాడారు. ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ గురించి మాట్లాడారు. పవన్ ఫ్యాన్స్ గురించి మాట్లాడారు. అంతటితో ఆగకుండా క్షుద్రపూజలు అన్నారు. బూతులు తిట్టారు. పవన్‌కు అక్రమ సంబంధాలు ఆపాదించారు. గోత్రాలతో సహా అన్నీ మాట్లాడారు. ఇన్ని మాట్లాడారు. అయితే మీ గురించి.. మీ తల్లి గురించి తెలుసుకోవాలనుంది. మీ తల్లి గురించి ఓ రెండు నిమిషాలు మాట్లాడగలరా? అంటూ అడిగారు వివేక్.

ఈ ప్రశ్నకు కత్తి తన తల్లి గురించి చెప్పనని స్పష్టం చేశాడు. ఎన్నిసార్లు అడిగినా ఆ ప్రశ్నకు కత్తి మహేష్ బదులివ్వలేదు. తల్లి గురించి చెప్పేందుకు అంతగా వెనుకాడాల్సిన అవసరం ఏముందని వివేక్ ప్రశ్నించాడు. తల్లి గురించి చెప్పడమే కష్టమైందా? అసలు ఆమె గురించి చెప్పేందుకు జంకు ఎందుకు? అని అడిగారు. దేశంలో వున్న అందరి గురించి మాట్లాడుతున్న కత్తి గురించి.. అందరూ తెలుసుకోవాలనే ఆ ప్రశ్న వేశానని వివేక్ చెప్పుకొచ్చారు.

తల్లి గురించి దాయాల్సిన అవసరం ఏముందన్నారు. కత్తి తల్లి గురించి దాస్తే దాని వెనుక పెద్ద భయంకరమైన, దరిద్రమైన కథ వుందని అనుకోవచ్చా అని ప్రశ్నించారు. దేశంలో ఓ పౌరుడిగా తనకు కత్తి మహేష్ తల్లి గురించి తెలుసుకోవాలనుందని.. ఆ విషయాన్ని చెప్పాలని వివేక్ అడిగారు.

మీ అమ్మగారు గొప్పవారన్నదే తన అభిప్రాయమని.. ఆమె గురించి చెప్తే వినాల్సి వుందని వివేక్ అడిగారు. మీరు అందరినీ ప్రశ్నించవచ్చు. మీరు అందరి గురించి చెప్పొచ్చు. కానీ మిమ్మల్ని ఎవ్వరూ అడగకూడదా? అంటూ వివేక్ అడగారు. కానీ కత్తి మహేష్ మాత్రం నోరు విప్పకుండా లైవ్ షో నుంచి వెళ్లిపోయారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16