టాలీవుడ్

కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌పై పోలీస్ కేసు పెట్టనున్న కత్తి

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కత్తి మహేష్ తక్కువోడేం కాదనీ, తనను ఓ రోజున వాళ్లింటికి రమ్మని పిలిచాడని, గదిలోకి పిలిచి తనను బలవంతం చేయశాడని, అడ్డకోబోతే తనను కొట్టి బలాత్కారం చేశాడని ఆరోపించింది. ఆమె శనివారం ఓ టీవీ షో చర్చా కార్యక్రమంలో పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ గొడ‌వ‌లో `సైరా`(కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌) ఎగ్జిక్యూటివ్ నిర్మాత వాకాడ అప్పారావుపై ఆరోప‌ణ‌ల్ని స‌ద‌రు న‌టి తిప్పికొట్టే ప్రయత్నం చేసారు.

ఆ క్ర‌మంలోనే త‌న‌కు జ‌రిగిన అన్యాయానికి సునీత‌, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌పైనా కేసు పెట్టేందుకు క‌త్తి మ‌హేష్ రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. సునీత త‌న ప‌రువు తీసినందున రూ. 50 లక్షలకు పరువు నష్టం దావా వేస్తాన‌ని క‌త్తి ఫైర‌య్యారు. తనపై అన్నీ త‌ప్పుడు ఆరోప‌ణ‌లేన‌ని ప్ర‌తిదాడికి దిగారు. పోలీసు కేసు పెట్టాక అస‌లు నిజానిజాలు బయటకు వస్తాయని అన్నారు.

ఆ క్ర‌మంలోనే త‌న‌కు జ‌రిగిన అన్యాయానికి సునీత‌, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌పైనా కేసు పెట్టేందుకు క‌త్తి మ‌హేష్ రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. సునీత త‌న ప‌రువు తీసినందున రూ. 50 లక్షలకు పరువు నష్టం దావా వేస్తాన‌ని క‌త్తి ఫైర‌య్యారు. తనపై అన్నీ త‌ప్పుడు ఆరోప‌ణ‌లేన‌ని ప్ర‌తిదాడికి దిగారు. పోలీసు కేసు పెట్టాక అస‌లు నిజానిజాలు బయటకు వస్తాయని అన్నారు.

ముఖ్యంగా, కత్తి మహేష్ గురించి మాట్లాడుతూ, ఆయన తనను వాళ్లింటికి రమ్మని పిలిచాడని, గదిలోకి పిలిచి తనను బలవంతం చేయశాడని, అడ్డకోబోతే తనను కొట్టి బలాత్కారం చేశాడని వెల్లడించింది. ఈ విషయమై కత్తి మహేష్ స్పందించారు.

ఇదంతా ఓ కుట్ర అని, ఆ ఆరోపణలలో నిజం లేదని ఒక పబ్లిక్ స్టేట్మేంట్ ఇచ్చారు కత్తి మహేష్.

ఈ మధ్యకాలంలో టాపిక్ ఏదైనా నేనున్నా అంటూ టీవీలలో యాంకర్‌లకంటే ఎక్కువగా కనిపిస్తున్న కత్తి మహేష్.. శ్రీరెడ్డి వివాదంలోనూ నేనున్నా అంటూ ఉత్సాహపడ్డారు. అయితే ఓ టీవీ చర్చా కార్యక్రమంలో కత్తికి ఊహించని షాక్ తగిలింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గుట్టుని బయటపెట్టేందుకు సునీత అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్టుడియోకి వచ్చింది. అయితే అదే చర్చాకార్యక్రమంలో ఉన్న మహేష్ కత్తిను ఉద్దేశించిన ఇతడు నన్ను ఇంటికి పిలిచి బలవంతం చేశాడంటూ బాంబ్ పేల్చింది సునీత.

ఆమె మాట్లాడుతూ..‘‘కత్తి మహేష్ సంవత్సరం క్రితమే నాకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆయన అంతకు ముందు హైటెక్ సిటీలో ఓ ప్రోగ్రాం చేసేవారు. ఒకసారి నేను అమీతుమీ ఆడియో ఈవెంట్‌లో మహేష్ కలిసినపుడు ఆయనకు చాలా క్రేజ్ ఉన్నట్టుంది అనుకున్నాను. అప్పటి వరకూ ఆయన నాకు జస్ట్ ఫేస్‌బుక్ ఫ్రెండ్ మాత్రమే. ఆయన గురించి ఏమీ తెలియదు. ఈయనేంటి బిగ్‌బాస్‌కి రావడమేంటని నేను షాక్ అయ్యాను. ఎలిమినేషన్ అయ్యాక.. నేను మీ బిగ్‌బాస్ చూశాను సార్. చాలా బాగుంది అని కాల్ చేసి చెప్పాను.

బిగ్‌బాస్ షోలో ఫోన్‌లో మాట్లాడినపుడు మీ వైఫ్‌తో లక్నోకి వెళ్తాను అన్నారు కదా.. ఎందుకు హైదరాబాద్‌కి వచ్చారు అని అడిగాను. ‘నాపై ఎక్కువ కాంట్రవర్సీలు వచ్చాయి కదా బిగ్‌బాస్‌లో అందుకే వెనక్కి వచ్చాను అన్నారు. కలుస్తావా నన్ను..’ అని అడిగారు. కత్తి మహేష్ ఇలా చేస్తే నేనెవరికి చెప్పుకోవాలి?

కత్తి మహేష్‌ పై కంప్లైంట్ ఇవ్వడానికి లీగల్‌గా వెళ్లాను. ఆ సమయంలోనే జనసేన పవన్ కల్యాణ్ సార్‌కి, కత్తి మహేష్‌కి కాంట్రవర్సీ జరుగుతోంది. కానీ మహేష్‌పై కంప్లైంట్ తీసుకోలేమని పోలీసులు చెప్పారు. అంతకు ముందొకసారి నన్ను పిలిచి వాళ్లింటి బయట మాట్లాడాడు. ఆ తర్వాత నన్ను రమ్మని ఫేస్‌బుక్‌లో అడ్రస్ పెట్టాడు. కావాలంటే నేను ఫేస్‌బుక్‌లో మెసేజ్ చూపిస్తా. వెళ్లాక కమిట్‌మెంట్ ఇస్తావా? అని అడిగాడు. నేను ముందే చెప్పాను ఎవరికి పడితే వారికి కమిట్‌మెంట్ ఇవ్వనని.. దానికి నేను అంగీకరించను. అప్పుడు నన్ను డోర్ వేసి.. కొట్టి.. బలవంతం చేశాడు. తర్వాత బస్ టికెట్‌కి రూ.500 ఇచ్చి పంపించాడు. కత్తి మహేష్‌పై అన్ని ప్రూఫ్‌లు చూపిస్తా’’ అని సునీత పేర్కొంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16