హాలీవుడ్

‘టైటానిక్‌’లో జాక్ పాత్రపై ఇరవై ఏళ్ళ తర్వాత..

titanicదాదాపు ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన ‘టైటానిక్‌’గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ సినిమాలో లియొనార్డో డికాప్రియో (జాక్‌), కేట్‌ విన్స్‌లెట్‌ (రోజ్‌)లు ప్రేమికులుగా నటించి మన హృదయాలలో నిలబడి పోయారు. ఇద్దరూ తమ నటనతో మైస్మరైజ్‌ చేశారు. ఈ సినిమా చూసిన వాళ్లందరూ డైరక్టర్ కాస్త కరుణించి…జాక్‌ని బతికించి ఉంటే బాగుండేదనే అనుకున్నారు. ఇందులో హీరోయిన్ గా చేసిన కేట్‌ విన్స్‌లెట్‌ మనసులో కూడా ఇదే అభిప్రాయం ఉంది. రీసెంట్ గా ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న కేట్‌ ఈ విషయాన్ని వ్యక్తపరిచారు.

కేట్ మాట్లాడుతూ…‘‘విరిగిన ముక్క మీద జాక్‌కి కూడా చోటు ఉంది. కానీ, జేమ్స్‌ కామెరూన్‌ అతన్ని చనిపోయినట్లు చూపించాలనుకున్నారేమో. ఆ సీన్‌ చేస్తున్నప్పుడు ఏమీ అనిపించలేదు కానీ, సినిమా విడుదలైన 20 ఏళ్లకు జాక్‌ చేతిని రోజ్‌ వదలాల్సింది కాదు అనిపిస్తోంది’’ అన్నారు కేట్‌.

అలాగే అందరూ అనుకుంటున్నట్లుగా . ‘టైటానిక్‌’ తీస్తున్న సమయంలో ఒకరి పట్ల మరికొరికి ఆకర్షణ ఏమీ కలగలేదు అన్నారు. ఈ విషయమై కేట్ మాట్లాడుతూ… –‘‘అదేంటో కానీ, మా మధ్య అలాంటిదేం జరగలేదు. అప్పుడు మేమిద్దరం చాలా చిన్నవాళ్లం. సినిమాలో గాఢమైన రొమాంటిక్‌ సీన్స్‌ ఉన్నాయి కాబట్టి, మా మధ్య ఎట్రాక్షన్‌ మొదలై ఉంటుందని ఊహించారు. ఇప్పటికీ ఆ ఊహలోనే ఉన్నారు. బట్‌.. సారీ మా మధ్య అలాంటిదేం లేదు. 20 ఏళ్లుగా మేం మంచి స్నేహితులుగా ఉండిపోయాం’’ అన్నారు కేట్‌ విన్స్‌లెట్‌.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll