కోలీవుడ్

‘ఖాకి’ సినిమాపై శంకర్ కామెంట్స్

స్టార్ డైరక్టర్స్ ఓ సినిమాని చూసి మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో మాట్లాడితే ఆ సినిమాకు వచ్చే క్రేజే వేరు. అందుకు ఉదాహరణ..మన రాజమౌళి తను చూసిన సినిమాల గురించి చేసే ట్వీట్స్. ఆయన ఆయా సినిమాలను చూసి మెచ్చుకుంటూ మాట్లాడితే వాటికి కలెక్షన్స్ పెరుగుతూండటంతో మనం గమనించవచ్చు. అదే కోవలో తమిళ దర్శకుడు శంకర్ సైతం …తను చూసిన సినిమాల్లో నచ్చినవాటిని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తూంటారు. తాజాగా శంకర్‌ ‘ఖాకి’ సినిమాని చూసి తన అభిప్రాయాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. సినిమా అద్భుతంగా ఉందన్నారు.

‘‘తీరన్‌ అధిగారమ్‌ ఒండ్రు’ (తెలుగులో ‘ఖాకి’) అద్భుతమైన పోలీసు సినిమా. థియేటర్లో తర్వాత సన్నివేశం ఏంటి?.. అనే ఆతృతతో సీట్‌ చివర్లో కూర్చోవాల్సిన పరిస్థితి. దర్శకుడు హెచ్‌. వినోద్‌ చాలా కష్టపడి తెరకెక్కించారు. కార్తి, జిబ్రన్‌, డీవోపీ, మొత్తం చిత్ర బృందం చక్కగా పని చేశారు’ అని శంకర్‌ ట్వీట్‌ చేశారు.

కార్తి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘ఖాకి’. అభిమన్యు సింగ్‌, బోస్‌ వెంకట్‌, స్కార్లెట్‌ మల్లిష్‌ విల్సన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 17న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ కలెక్షన్స్ పరంగానూ నిర్మాతలకు ఆనందాన్ని కలిగిస్తోంది.

తొంభైల్లో జరిగిన యదార్ద సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో కార్తి పోలీసు అధికారి పాత్రలో కనిపించారు. ఒక ముఠాను అంతం చేయడమే లక్ష్యంగా పోలీసు బృందం చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తీశారు. ఇక దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘2.ఓ’ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2