బాలీవుడ్

గంటలతరబడి జిమ్ లోనే ..చెమటలు చిందిస్తోంది

హీరోయిన్స్ కెరీర్ లో ఓ స్టేజికి వచ్చి, ఆఫర్స్ సన్నగిల్లాక వివాహం చేసుకుని సెటిల్ అవుతారు. సెటిల్ అయ్యాక ఇక శరీరం గురించి పట్టించుకోరు, గాలికి వదిలేసినట్లుగా వదిలేస్తారు. దాంతో అప్పటివరకూ ఎంతో స్లిమ్ గా ఉన్నవాళ్లు..ఊబకాయులగా మారతారు. ఇది చాలా మంది హీరోయిన్స్ జీవితాల్లో జరిగింది. అయితే తను మాత్రం అలా కాకూడదు అనుకుంటోంది కరీనాకపూర్.

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ 2012లో హీరో సైఫ్‌ అలీఖాన్‌ను వివాహం చేసుకుంది. గతేడాది డిసెంబర్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న కరీనా ఇటీవలే ‘వీరే డీ వెడ్డింగ్‌’ చిత్రానికి ఒకే చెప్పింది. అయితే ప్రసవం తర్వాత బరువు పెరగడంతో ఇప్పుడు సన్నబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు బరువు తగ్గుతూనే… ఫిట్‌నెస్‌ కోసం చాలా కష్టపడుతోంది.

ఈ చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించనున్న కరీనా రోజుకు 10 గంటలు కష్టపడుతోందట. వ్యాయామం కోసం దిల్లీలో తాను బస చేసిన హోటల్‌లోనే ప్రత్యేక యంత్రాన్ని సమకూర్చుకుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోని సైతం షేర్ చేసారు.

Super girls 🏃🏼‍♀️#fitnfun #friendsdoitbettertogether

A post shared by Amrita Arora (@amuaroraofficial) on

‘ఆమె 14 గంటలు సెట్లో ఉన్నా కూడా రాత్రిపూట వ్యాయామాలు చేస్తోంది. ఖాళీ దొరికితే జిమ్‌లోనే చెమటలు చిందిస్తోంది. కసరత్తులకు తగినట్లుగా సమతుల్య ఆహారం తీసుకుంటోంది’ అని యూనిట్‌ చెబుతోంది.
‘వీరే డీ వెడ్డింగ్‌’ చిత్రంలో కరీనాతో పాటు సోనమ్‌ కపూర్‌, శిఖా తల్సానియా, స్వరభాస్కర్‌, సుమీత్‌ వ్యాస్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కరీనా నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. గత నెల సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం దిల్లీలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని శశాంక ఘోష్‌, సోనమ్‌ సోదరి రియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మేలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll