టాలీవుడ్

మత్తు మందు కలిపి రేప్ చేసాడంటూ హీరో పై పోలీస్ కంప్లైంట్

subramanyaహాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా సినీ రంగానికి సంబంధించి పలు అత్యాచార వివాదాలు, ఉదంతాలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగాతనపై ఓ కన్నడ నటుడు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువతి చేసిన ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది. కన్నడ ,సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… కన్నడ నటుడు సుబ్రమణ్య, స్వప్న ఇద్దరు ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా చిగురించి పెళ్లి చేసుకునేదాకా వచ్చింది. అయితే తన చిత్రం హెంబణ్ణ విడుదలకు సిద్ధంగా ఉన్న వేళ.. సినిమా విడుదల అయ్యాక పెళ్లి చేసుకుంటానని.. అప్పటివరకూ వాయిదా వేయాలని కోరారు. అందుకు యువతి పేరెంట్స్ ఓకే అన్నారు. ఇదిలా ఉండగా.. హెంబణ్ణ మూవీ రిలీజ్ కావటమే కాదు.. విజయవంతం కావటంతో పెళ్లి ప్రపోజల్ మరోసారి తెర మీదకు వచ్చింది.

కానీ తాను కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయనున్నట్లుగా చెప్పి.. పెళ్లి వ్యవహారాన్ని మరోసారి వాయిదా వేశాడు. దీనికి సదరు యువతి తల్లిదండ్రులు సరేనన్నారు .

ఈ నేపథ్యంలో సుబ్రమణ్య, నవంబర్‌ 1న తన సోదరి ఇంట్లో పార్టీ ఉందనిచెప్పి స్వప్నను పిలిచాడు. పార్టీకి వెళ్లిన స్వప్నకు మత్తు మందు కలిపిన డ్రింక్‌ ఇచ్చి తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే మొహం చాటేశాడని , పెళ్లి విషయం మీద నిలదీస్తే.. తనను ఇప్పుడు బెదిరిస్తున్నాడని పేర్కొంది.

తనని వదిలిపోవాలని.. లేనిపక్షంలో యాసిడ్ దాడి చేస్తానని హెచ్చరిస్తున్నట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులకు సదరు యువతి ఫిర్యాదు చేయటంతో.. నటుడు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll