బాలీవుడ్

వివాదంలోకి హీరోయిన్ చెల్లెలు ఎంట్రీ,ఆధారాలతో…హీరోకు ట్విస్ట్

కంగన రనౌత్‌ విషయంలో హృతిక్‌ రోషన్‌ తో జరుగుతున్న వివాదంలోకి కంగన సోదరి రంగోలి సీన్ లోకి వచ్చింది. హృతిక్ పెట్టిన పోస్ట్‌పై కంగన సోదరి రంగోలి స్పందించి షాక్ ఇచ్చింది. ఎప్పుడూమాజీ భార్య వెనుక దాక్కుని మాట్లాడతావేంటి అంటూ విమర్శించారు. కొన్ని రోజులుగా కంగన తనపై చేస్తున్న కామెంట్స్‌పై హృతిక్‌ మొదటిసారి ఫేస్‌బుక్‌ ద్వారా స్పందించారు. పోస్ట్‌లో కంగనకు తనకు మధ్య ఎలాంటి గొడవలు, సంబంధాలు లేవని స్పష్టం చేశారు. దీనిపై రంగోలి ట్విటర్‌లో స్పందించారు.

‘హృతిక్‌విచారణ కోసం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు తన ల్యాప్‌టాప్‌ ఇచ్చానన్నారు. కానీ కంగనకు ఈ-మెయిల్స్‌ పంపడానికి హృతిక్‌ ఐప్యాడ్‌ వాడారు. అయినా కంగన నడము పట్టుకుని దిగిన ఫొటో ఎలా బయటికి వచ్చిందో మాకే తెలీదు. అతనేమో ఫొటోషాప్‌ చేశారు అంటాడు. ఈ విషయాన్ని నిరూపించగలడా? వేరొకరితో తన భర్త తిరుగుతున్నాడని భార్యకి ఎలా తెలుస్తుంది? అయినా ప్రతి విషయానికి మాజీ భార్య వెనక దాక్కోవడమేంటి?’ అని ట్వీట్‌ చేస్తూ హృతిక్‌ కంగనకు పంపిన మెయిల్‌ ఫొటోను పోస్ట్‌ చేసింది.

రీసెంట్ గా హృతిక్ పెట్టిన పోస్ట్…

రీసెంట్ గా హృతిక్‌ ఫేస్‌బుక్‌ ద్వారా తొలిసారి స్పందించారు. ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. ‘నేనెప్పుడూ ప్రతిభను, నా పనినే నమ్ముతాను. నేను చేసే పనిలో సంబంధంలేని విషయాలు అడ్డు వస్తే పట్టించుకోను. ఇలాంటి అనవసరపు విషయాలు మన పనికి భంగం కలిగిస్తున్నప్పుడు వాటిని పట్టించుకోకపోవడమే ఉత్తమం. కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఒక్కోసారి ఎలా పెద్దవి అవుతాయో అదే విధంగా ఈ విషయం(కంగనతో విభేదం) కూడా నాకు తలనొప్పిగా మారింది.’

‘ఈ విషయాన్ని మీడియా కూడా వదిలేలా లేదు. ఇందులో నా తప్పేం లేదు అని చెప్పాల్సిన అవసరం లేదని అనిపిస్తోంది. నన్ను అనవసరంగా నీచమైన విషయాల్లోకి లాగుతున్నారు. నిజం ఏంటంటే.. ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఏ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ గొడవపడలేదు.అంతెందుకు నా భార్య సుసానేతో విడిపోయేటప్పుడు కూడా ఆమెతో ఎలాంటి గొడవ పెట్టుకోలేదు. నేను కంగన కలిసి పనిచేశాం. కానీ రహస్యంగా కలుసుకుంటూ స్నేహపూర్వకంగా ఉన్నామన్నది నిజం కాదు.’

‘ నాపై వస్తున్న వార్తల్ని ఖండించడానికి నేను ఈ వివరణ ఇవ్వడంలేదు. నేను మంచివాడిననీ చెప్పడం లేదు. నేను చేసిన తప్పులేంటో నాకు తెలుసు. నేనూ మనిషినే. జీవితాన్ని నాశనం చేయాలని చూసే విషయాల నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నాను. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటూ కేవలం అసత్యాలనే నమ్ముతాం అన్నా కూడా నాకేం ఇబ్బందిలేదు.’

‘ ఎన్నో ఏళ్ల పాటు మగవాళ్ల కారణంగా కష్టాలు ఎదుర్కొన్న మహిళలు ఉన్నారు. మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తించే మగాళ్లని చూస్తే నాకు ఒళ్లుమండిపోతుంది. ఈ ఒక్క లాజిక్‌తో ఆడవాళ్లు చాలా సున్నితంగా ఉంటారు పురుషులే అబద్ధాలు ఆడతారు అని అనుకున్నా నాకేం పర్వాలేదు. 2014లో పారిస్‌లో దిగిన ఒక్క ఫొటోతో సంబంధం అంటగట్టేస్తున్నారు. నా పాస్‌పోర్ట్‌ వివరాల ప్రకారం 2014 జనవరిలో నేను పారిస్‌ వెళ్లలేదు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన మా ఇద్దరి ఫొటోలను ఫొటోషాప్‌ చేశారు.’

‘ఆ తర్వాత నా మాజీ భార్యతో సహా స్నేహితులు, సన్నిహితులు నాకు మద్దతు తెలిపారు. ఈ విషయాలు నన్ను ఎవరూ అడగలేదు. ఎందుకంటే మన సమాజంలో కేవలం మహిళలనే కాపాడాలన్న సిద్ధాంతం ఉంది. నేనూ దాన్నే నమ్ముతాను. కానీ మా ఇద్దరి విషయంలో వస్తున్న ఆరోపణల్ని నిరూపించడానికి సైబర్‌ క్రైమ్‌కు రోజుల సమయం చాలదు. విచారణ కోసం నా వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌, ఫోన్లు అన్నీ సైబర్‌ క్రైమ్‌ అధికారులకు అప్పగించాను.’

‘ కానీ కంగన మాత్రం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నేను మళ్లీ చెప్తున్నాను. ఇది ఇద్దరు ప్రేమికులకు సంబంధించిన గొడవ కాదు. కాబట్టి మీడియా కూడా మా విషయాన్ని అలా ప్రస్తావించకుండా ఉంటే మంచిదని భావిస్తున్నాను. ఈ ఒక్క విషయం నన్ను నాలుగేళ్లుగా ఇబ్బంది పెడుతోంది. కానీ సమాజంలో మహిళల పట్ల ఉన్న విలువలు నన్ను నోరు మెదపనివ్వలేదు. అలా అని నాకు కోపంగానూ లేదు. నేను ఎవరినీ తప్పుబట్టడంలేదు. నిజం గెలవకపోతే కుటుంబాలతో పాటు సమాజం కూడా బాధపడాల్సి వస్తుంది.’ అని పేర్కొన్నారు హృతిక్‌.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll