బాలీవుడ్

నన్నే అంటుందా, ఆ హీరోయిన్ పిచ్చిది, అయినా వదలను

aditya-pancholi-759తమపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని , అయినా ఆమె పిచ్చది, లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ ప్రముఖ నటుడు, నిర్మాత ఆదిత్య పంచోలీ మండిపడ్డారు. కంగన పిచ్చిదని ఆమెని వదిలేది లేదని పేర్కొన్నారు. తనని నెత్తిమీద రక్తం వచ్చేలా కొట్టాడంటూ ఆదిత్య పంచోలిపై కంగనా చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపధ్యంలో ఇలా రెస్పాండ్ అయ్యాడు ఆయన.kanganaranaut-1_149805164479

ఆదిత్య పంచోలీ మాట్లాడుతూ.. ‘ఆమె పిచ్చిది. ఆమె ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఓ పిచ్చి పిల్ల మాట్లాడుతున్నట్లు మీకు అనిపించలేదా? మేము చిత్ర పరిశ్రమలో చాలా కాలం నుంచి ఉంటున్నాం. ఇప్పటివరకు ఇంత అసహ్యంగా మాపై వ్యాఖ్యలు చేసినవారు లేరు. బురదలో రాళ్లు వేస్తే అది మనమీదే పడుతుంది. కంగనపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటున్నాను. మిగతా వారి విషయంలో కంగన ఏం మాట్లాడిందో నాకు అనవసరం. నా విషయంలో మాత్రం ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే. ఆమె నాపై వేసిన నిందలు నిరూపించమనండి. నా కుటుంబం ఎంతో అవమానం ఎదుర్కొంది’ అని కంగనపై మండిపడ్డారు పంచోలీ.

బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌పై మాటల దాడి మొదలైంది. ఆమె ఎవరిపై అయితే ఆరోపణలు చేసిందో వారంతా ఇప్పుడు మాట యుద్ధం మొదలు పెట్టారు. ఒకరు ఆమె పిచ్చిందంటే…మరొకరు ఇది పబ్లిసిటీ స్టంట్‌ అంటూ ఎదురు దాడి చేస్తున్నారు. కంగనాతో ప్రేమాయణం నడిపిన హీరో ఇంకా స్పందించలేదు.kangana-ranaut-hot-20

బాలీవుడ్‌లో ఏ విషయంలోనైనా ధైర్యంగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కంగనా అనే చెప్పాలి. తనకు 16 ఏళ్ల నాడు సినీ కెరీర్‌ను ప్రారంభించిన దగ్గర నుంచి నేటి వరకూ బాలీవుడ్‌లో అనేక విషయాలపై విభేదిస్తూనే వస్తోంది. ఆ విషయాలపై బహిరంగంగానే మాట్లాడేస్తుంది. అందుకే ఆమెకు ధైర్యమొక్కువ అంటారు.

మొన్న రాజత్‌ శర్మ టీవీ షో ‘ఆప్‌ కి అదాలత్‌’ లో హృతిక్‌ రోషన్‌, నిర్మాత, నటుడు ఆదిత్యా పాంచోలి, మహిళా కమిషన్‌, రాకేష్‌ రోషన్‌ తదితరులపై ఆరోపణలు చేసింది. 2016లో ఈ వివాదంపై ఓ ఇంటర్వ్యూలో హృతిక్‌ తదితరులను ‘సిల్లీ ఎక్స్‌’ అని అనడంతో ఈ వివాదం మొదలైంది. తర్వాత సద్దుమణిగినా మొన్న కంగనా చేసిన ఆరోపణలతో మళ్లీ రాజుకుంది. కంగనా ధైర్యానికి చిత్రసీమ నుంచి మద్దతును పక్కనబెడితే సాధారణ ప్రజానీకం నుంచి పూర్తి సపోర్టు లభిస్తోంది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll