బాలీవుడ్

వివాదం అందుకేనా…మగతోడు అవసరం లేదని చెప్పటానికేనా

సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనే గుర్తింపు ఉన్నా… ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో అందరిలో నోళ్లలో నానడం కంగనా రనౌత్‌కు బాగా అలవాటు. హిట్టయితే సినిమాలు లేకపోతే వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే ఈ హాట్ బ్యూటీ, లేటేస్ట్‌గా మరోసారి హృతిక్ రోషన్ వివాదం మరోసారి తవ్వి తీసింది. ఎందుకా అంటే..ఇదిగో ఈ సాంగ్ తో అర్దమైంది.

‘మణికర్ణిక’ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోయే కంగనా అంతకుముందు ‘సిమ్రన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. సెప్టెంబర్‌లో ఆడియెన్స్ ముందుకు రాబోయే ఈ మూవీపై అమ్మడు ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఈ సినిమా టీజర్,సాంగ్ చూసిన వాళ్లంతా కేవలం కంగనా కోసమే ఈ సినిమా తీశారేమో అని కామెంట్స్ చేసేస్తున్నారు. ఈ సాంగ్ టీజర్‌లో రకరకాల హెయిర్ స్టయిల్స్‌లో కనిపించడం, పలువిధాలా హావభావాలు ప్రదర్శించడం మినహా కంగనా చేసిందేమీ లేదంటున్నారు.

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సిమ్రన్‌’. ప్రముఖ జాతీయ అవార్డు గ్రహీత హన్సల్‌ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ‘సింగిల్‌ రెహ్‌నేదే’ అనే పాట విడుదలైంది.

పాట మొత్తంలో కంగనా సింగిల్‌గా ఉంటేనే జీవితం ఎంతో హాయిగా ఉంటుంది అని పాడటం ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో కంగనా.. ప్రఫుల్‌ పటేల్‌ అనే వివాహిత పాత్రలో నటిస్తోంది. ఇందులో కంగనా భర్త నుంచి విడిపోతుంది. ఓ మహిళ జీవితంలో హాయిగా ఉండటానికి మగతోడు అవసరం లేదనేది కంగనా అభిప్రాయం. తనకు నచ్చినట్లుగానే జీవించే అమ్మాయి పాత్రలో కంగనా ఒదిగిపోయింది. భూషణ్‌ కుమార్‌, శైలేష్‌ ఆర్‌.సింగ్‌, కృషణ్‌ కుమార్‌, అమిత్‌ అగర్వాల్‌లు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్‌ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు ఈ సినిమా కూడా ‘క్వీన్’ తరహాలోనే ఉంటుందేమో అనే గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఎమోషన్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధిస్తున్న ఈ ముద్దుగుమ్మ ‘సిమ్రన్’తోనూ అదే పని చేస్తుందేమో అనే వారూ లేకపోలేదు. ఏదేమైనా ‘సిమ్రన్’ రిజల్ట్‌ను బట్టే వచ్చే ఏడాది రిలీజ్ కాబోయే ‘మణికర్ణిక’ సినిమాపై అంచనాలు పెరగడమో, తగ్గడమో జరుగుతుందనే ప్రచారం కూడా సాగుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll