టాలీవుడ్

పెద్దాయన వీళ్లద్దరిని ఇలా అనేసారేంటి

Charuhasanసినిమా నటులు రాజకీయాల్లోకి రావటం, సక్సెస్ అవటం ప్రపంచ వ్యాప్తంగా చాలా కాలంగా జరుగుతున్న సంగతే. ముఖ్యంగా తమిళ, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, సినిమాలు రెండింటిని జనం విడతీసి చూడరు. దాంతో సినిమా హీరోలు తర్వాత రాజకీయాలవైపు అడుగులు వేస్తూంటారు. ఇప్పుడు అదే పద్దతిలో కమల్, రజనీ కూడా రాజకీయ తెరంగ్రేటం చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వాళ్లు ఎలక్షన్స్ లో నిలబడితే ముఖ్యమంత్రులు అవుతారని అభిమానులు అంటున్నారు. అయితే వాళ్లకు అంత సీన్ లేదని కమల్ సోదరుడు చారుహాసన్ .. అంటున్నారు.

తాజాగా ఓ ప్రైవేటు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కమల్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమాత్రం లేదన్నారు. రజనీకాంత్‌ అసలు రాజకీయాల్లోకి రారని చెప్పారు. ఇప్పుడున్న నేతల్లో ఎవరికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని అడిగిన ప్రశ్నకు.. పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రామదాసు పేరు చెప్పారు. మొత్తానికి తన సోదరుడి నమ్మకాన్నే కమల్‌ సొంతం చేసుకోలేకపోయారనే వార్తలు ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్నాయి.

విశ్వనటుడు కమల్‌హాసన్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని ఆయన సోదరుడు చారుహాసన్‌ పేర్కొన్నారు. నటుడు కమల్‌హాసన్‌ రాజకీయ ప్రవేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. నవంబరు ఏడో తేదీన పార్టీ జెండా, అజెండాలను ప్రకటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న ఆయన సోదరుడు చారుహాసన్‌.. కమల్‌ రాజకీయ అరంగేట్రంపై స్పందించారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రాజు గారి గది 2 OCT 13
రాజా ది గ్రేట్ OCT 18
ఉన్నది ఒకటే జిందగీ OCT 20
నెక్స్ట్ నువ్వే NOV 03
లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21

Poll