టాలీవుడ్

అలా చేస్తే కుటుంబానికి ఇబ్బంది కలుగుతుందేమో

kalyan-ramమళయాళనటుడు దిలీప్‌ హీరోగా నటించిన చిత్రం మళయాళీచిత్రం ‘రామ్‌లీలా’. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌ అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

ఈ సినిమాను తెలుగులో రీమేక్ చెయ్యబోతున్నారు నిర్మాత గిరి. ‘దిల్, సై’ చిత్రాలకు సహా నిర్మాతగా వ్యవహరించిన గిరి చాలా గ్యాప్ తరువాత సొంత నిర్మాణ సంస్థలో సినిమా స్టార్ట్ చెయ్యబోతున్నారు. ఇందులో కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా కథ కల్యాణ్‌కు బాగా నచ్చిందని, ప్రస్తుతం దీని రీమేక్‌ హక్కులు పొందే పనిలో ఆయన ఉన్నారని సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాకపోతే కళ్యాణ్ రామ్ తీసుకునే ఈ ఈ నిర్ణయం కరెక్ట్ కాదంటున్నారు. ఎందుకంటే ఈ చిత్రం కథలో … ఓ పార్టీ నాయకుడు హత్యకు గురైతే అతని కుమారుడు అవతలి పార్టీపై నాయకులపై ప్రతీకారం తీర్చుకునే కాన్సెప్ట్ తో నడస్తుంది. ఇది ప్రస్తుతం అధికారంలో ఉన్న తమ కుటుంబానికి చెందిన పార్టీకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉండడంతోనే.. కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా చేయద్దనే అందరూ అంటున్నారు.

కల్యాణ్‌రామ్‌ ఇటీవల ‘యం.ఎల్‌.ఎ’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. ఉపేంద్ర దర్శకుడు. కాజల్‌ ఇందులో ఆయన సరసన నటించారు. ప్రస్తుతం ఆయన హీరోగా జయేంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు.
కల్యాణ్‌రామ్‌ ‘ఇజం’ చిత్రంతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll