కోలీవుడ్

‘కాలా’ క్లైమాక్స్ లీక్‌.. వైరల్‌, వీడియో ఇదిగో

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం ‘కాలా’. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించిన కొన్ని డైలాగ్స్ గతంలో లీక్ అయ్యాయి. ఇప్పుడు క్లైమాక్స్ సీన్ కి సంబంధించిన వీడియో లీక్‌ అయ్యింది. ఎడిట్‌ చేయని ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్లో చక్కర్లు కొడుతోంది. దీంతో సినిమా పరిశ్రమకు చెందిన వారు, టీమ్ షాక్‌కు గురయ్యారు. ఆ వీడీయోని మీరు ఇక్కడ చూడచ్చు. అయితే ఈ వీడియోని కావాలనే లీక్ చేసారని, క్రేజ్ క్రియేట్ చేయటానికి, బిజినెస్ చేసుకోవటానికి వేసిన ఓ ట్రిక్ అని కొందరు వ్యాఖ్యానించటం గమనార్హం.

ఇటీవల రజనీ ‘కాలా’ డబ్బింగ్‌ పూర్తి చేసుకున్నారు. ఇందులో ఆయన ముంబయిలోని తమిళుల కోసం పోరాడే గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను రజనీ అల్లుడు, నటుడు ధనుష్‌ నిర్మిస్తున్నారు. తొలిభాగం చిత్రీకరణ ముంబయిలో, రెండో భాగం తమిళనాడులో జరిగింది. ఇందులో రజనీ సతీమణిగా ఈశ్వరీరావు నటిస్తున్నారు.

బాలీవుడ్‌ నటి హ్యుమా ఖురేషీ, నానా పటేకర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.‘కబాలి’ తర్వాత రజనీ-పా రంజిత్‌ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. ఏప్రిల్‌ 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

tr> tr>
అ! FEB 16
ఆచారి అమెరికా యాత్ర FEB 16
మనసుకు నచ్చింది FEB 16
కిరాక్ పార్టీ FEB

Now Showing

tr> tr>
తొలిప్రేమ FEB 10
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10