టాలీవుడ్

చిత్రగారూ..మీకు అభినందననలు

chitra-1ప్రముఖ గాయని కె.ఎస్‌.చిత్రను కేరళ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పురస్కారంతో గౌరవించనుంది. ఈ ఏడాదికిగానూ హరివరాసనమ్‌ పురస్కారానికి చిత్రను ఎంపిక చేసింది. కేరళ ప్రభుత్వం ఏటా అందజేసే ‘హరివరాసనమ్‌’ పురస్కారానికి ఈ ఏడాది చిత్రని ఎంపిక చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకోవటంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తన పాటల ద్వారా లౌకిక స్ఫూర్తిని, సమానత్వాన్ని, సౌభాతృత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేసినందుకుగానూ ఆమెకు ఈ పురస్కారం దక్కింది. జనవరి 14న శబరిమల దేవస్థానంలో జరిగే ఓ కార్యక్రమంలో చిత్రకు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఇందులో భాగంగా ఆమెకు రూ.లక్ష నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నారు.

మధురమైన తన స్వరంతో పాటలు పాడుతూ.. అందరిలో లౌకిక స్ఫూర్తిని పెంపొందిస్తున్నందుకే చిత్రకి ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక పురస్కారం ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘దక్షిణ భారత నైటింగేల్‌’ అని బిరుదందుకున్న సింగర్ చిత్రకు ఎన్నో జాతీయ చలనచిత్ర అవార్డులు వచ్చాయి. ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. ఈ స్థాయి అవార్డులు మరే గాయనీమణికీ రాలేదనే చెప్పవచ్చు.

మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల సినిమాలకు గాత్రదానం చేశారు. చిత్ర అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. సినిమాల్లోకి వచ్చాక ఆ పేరు సింపుల్ గా చిత్ర గా మారింది.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll