కోలీవుడ్

జ్యోతిక నోటి నుంచి పచ్చి బూతు

జ్యోతిక అటు తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, విక్రమ్ లతో నటించింది. ఇటు తెలుగులో కూడా మెగా స్టార్ చిరంజీవి, నాగార్జున, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించింది. తమిళ హీరో సూర్యని వివాహం చేసుకున్న జ్యోతిక… కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ తరువాత తిరిగి సినిమాల్లో నటించడం మొదలెట్టింది. తాజా గా జ్యోతిక తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిన బాల డైరెక్షన్ లో ‘నాచియర్’ అనే సినిమా లో నటిస్తుంది. ఆ చిత్రాన్ని డైరక్ట్ చేస్తోంది..మరెవరో కాదు ప్రముఖ దర్శకుడు బాలా.

స్త్రీ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి చెందిన టీజర్ విడుదలైంది. 36 వయోదినిలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక మగలిర్ మట్టుమ్ అనే సినిమా చేస్తుంది. బాల చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన జ్యోతిక ఈ చిత్రాన్ని చేసేందుకు వెంటనే ఓకే చెప్పింది.

నాచియార్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ లో జ్యోతిక లుక్ పాటు ఆమె చెప్పే డైలాగు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టీజర్ మొత్తం మీద ఒకే ఒక డైలాగు ఉంది. అది ఓ బూతు పదం. తెలుగులోనూ ఈ చిత్రం డబ్బింగ్ చేయబోతున్నారు. తెలుగు టీజర్ కూడా అదే బూతు పదంతో మన ముందుకు వస్తుందా అనే డౌట్ ఇప్పుడు అందరిలో కలుగుతోంది.

సంగీత దర్శకుడు, నటుడు అయిన జివి ప్రకాశ్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.

తొలి నుంచీ ..కమర్షియల్ ఫార్ములా సినిమాలకు దూరంగా రియలిస్టిక్ సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నారుబాల.ఈ నేపధ్యంలో బాల అనేక జాతీయ పురస్కారాలు సొంతం చేసుకొన్నారు. ఈయన తెలుగులోనూ ఆయన డైరక్ట్ చేసిన ‘శివపుత్రుడు’, ‘నేను దేవుణ్ణి’, ‘వాడు వీడు’చిత్రాలు డబ్బింగ్ వెర్షన్స్ మంచి హిట్ అయ్యాయి. వాస్తవ పరిస్థితులను హృద్యంగా ఆవిష్కరించే బాల ప్రస్తుతం తన దర్శకత్వంలో జ్యోతిక ప్రధాన పాత్రలో ఈ మూవీ చేస్తున్నాడు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు 17

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll