టాలీవుడ్

మీ నుంచి ఇంతకంటే ఇంకేం కోరగలను: ఎన్టీఆర్

ntrఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కిన జై లవకుశ సినిమా నిన్న గురువారం నాడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తారక్, హీరోయిన్స్ కి, ఇక టీంకి సెలబ్రేతీలు తమ విషెస్ చెప్పారు. జై లవకుశ మీద మంచి అంచనాలు ఉన్నాయని, వాటిని అందుకోవడానికి అందరు ట్రై చేయాలని ఆశిస్తూ తారక్ కి శుభాకాంక్షలు చెప్పారు. ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమా చక్కగా ఉందని సినీ ప్రముఖులు, విమర్శకులు ఎన్టీఆర్‌, చిత్ర బృందాన్ని ప్రశంసించారు.

ఎన్టీఆర్ నటనకు అభిమానులతో పాటు సినీప్రియులు కూడా ఫిదా అయిపోయారు. ‘నటన అనేది మనిషి అయితే, దానికి ప్రాణం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా అభినందించారు. తాను ప్రాణం పెట్టి చేసిన సినిమాపై ప్రేమను కురిపిస్తున్న అందరికీ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ ఆనందంతో ట్విటర్‌లో స్పందించారు. ఓ నటుడిగా దీనికి మించి ఇంకేమీ అడగనని అన్నారు.

‘‘జై లవకుశ’పై మీరు చూపిన ప్రేమ చాలా సంతృప్తిని ఇచ్చింది. ఓ నటుడిగా.. దీని కన్నా ఉత్తమమైనది ఏమీ అడగను. అందరికీ ‘జై లవకుశ’ చిత్ర బృందం నుంచి ధన్యవాదాలు’ అని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రం తొలి రోజున దేశవ్యాప్తంగా రూ. 24 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అమెరికాలో బుధవారం ప్రదర్శించిన ప్రీమియర్‌ షోలో రూ. 3.64 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు.

Comments

comments

Trending

Latest

Trailer

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll